AP Welfare Dept. Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లోని వైయస్సార్ కడప జిల్లాలో ఉన్న స్త్రీ శిశు మరియు సాధికారిక కార్యాలయం, గృహహింస చట్ట విభాగం నందు ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నట్లయితే 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు అయినటువంటి వారు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం సర్టిఫికెట్ల పరిశీలన చేసి మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తారు. ఈ రిక్రూట్మెంట్ యొక్క అర్హతలు, వయస్సు, జీతం, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లు చూసి అప్లై చేయండి.
పోస్టుల వివరాలు వాటి అర్హతలు:
ఏపీలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానం నందు డిప్లమా కోస్ట్ చేసిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
ముఖ్యమైన వివరాలు:
| అంశము | వివరాలు |
| విడుదల చేసిన సంస్థ | ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ మరియు సాధికారత సంస్థ |
| పోస్ట్ పేరు | డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ |
| అర్హతలు | ఏదైనా డిగ్రీ అర్హత |
| వయస్సు | 25 నుండి 42 సంవత్సరాలు |
| ఆఖరు తేది | 20th నవంబర్, 2025 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
శాలరీ వివరాలు:
ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ నుండి విడుదలైన డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹18,500 వరకు జీతాలు చెల్లిస్తారు. ఇవి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కావున ఇతర ఎలివెన్సెస్ ఏమి చెల్లించబడవు.
APSRTC లో 291 ఉద్యోగాలు విడుదల : Apply
ఎంత వయస్సు ఉండాలి?:
ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు క్యాటగిరిలవారీగా ఈ క్రింది వయోపరిమితి కలిగి ఉండాలి.
- UR అభ్యర్థులకు: 25 నుండి 42 సంవత్సరాలు
- SC, ST, EWS, OBC అభ్యర్థులకు: 25 నుండి 47 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి.
సెలక్షన్ ప్రాసెస్:
ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలైన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
సింగరేణిలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్: Apply
- దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్స్ ని అర్హతల్లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్టు చేస్తారు.
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
- అన్ని అర్హతలు ఉన్నవారికి సంబంధిత డిపార్ట్మెంట్లో పోస్టింగ్ ఇస్తారు.
కావలసిన సర్టిఫికెట్స్:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫారం తో పాటు ఈ క్రింది సర్టిఫికెట్స్ కూడా జత చేసి గడువులోగా అప్లికేషన్స్ ని సబ్మిట్ చేయాలి.
- పదో తరగతి మార్క్స్ మెమో
- డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
- కంప్యూటర్ పరిజ్ఞానంలో డిప్లమో చేసిన సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రాలు
- స్టడీ సర్టిఫికెట్స్
- పూర్తిచేసిన దరఖాస్తు ఫారం
దరఖాస్తు ఫీజు?:
అభ్యర్థులు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన లింక్స్:
Notification & Application Form
Note: పైన తెలిపిన పూర్తి వివరాలు చూసి, అర్హతలు కలిగిన వారు గడువులోగా వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
