CWC Jobs Notification 2025:
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుండి 11 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను రెండు సంవత్సరాలు కాంట్రాక్ట్ విధానంలో పట్టించడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగి ఉండి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హతలు మరియు మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వెంటనే సంబంధిత డిపార్ట్మెంట్లో పోస్టింగ్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు వాటి అర్హతలు :
సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుండి 11 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగినటువంటి వారు దరఖాస్తులు చేసుకోవచ్చు. 0-3 సంవత్సరాల వరకు అనుభవం కలిగినటువంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ఎంత వయసు ఉండాలి?:
యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నిరుద్యోగ అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 35 సంవత్సరాలు వరకు వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో మూడు నుండి ఐదు సంవత్సరాలు వరకు సడలింపు ఉంటుంది.
ఎంపిక చేసే విధానం:
CWC నుండి విడుదలైన యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు ఈ క్రింది విధంగా ఎంపిక చేస్తారు.
తల్లికి వందనం పథకానికి మళ్లీ అప్లై చేసుకోవడానికి అవకాశం : వెంటనే Apply
- ముందుగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్స్ ని షార్ట్ లిస్టు చేస్తారు.
- అర్హతలు మరియు మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
- అభ్యర్థులు రెండు సంవత్సరాలు వరకు కాంట్రాక్టు విధానంలో పని చేయాలి.
- ఎటువంటి రాత పరీక్ష లేకుండా సెలక్షన్ చేస్తారు.
- అభ్యర్థుల యొక్క పర్ఫామెన్స్ ని ఆధారంగా చేసుకుని మరొక సంవత్సరం పొడిగిస్తారు.
ఎంత ఫీజు ఉంటుంది?:
CWC యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. నిరుద్యోగ అభ్యర్థులందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంత శాలరీ ఉంటుంది?:
యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకి ఎంపికైన అభ్యర్థులకు, ఇవి కాంట్రాక్టు ఉద్యోగులైనప్పటికీ నెలకు ₹50,000/- జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలెన్సెస్ అన్నీ కూడా చెల్లిస్తారు.
రెవెన్యూ డిపార్ట్మెంట్లో టెన్త్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల: Apply
అప్లికేషన్ చేసుకొనే ఆఖరి తేదీ:
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 11th నవంబర్, 2025
- ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేది : 25th నవంబర్, 2025
ముఖ్యమైన లింక్స్:
సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ మరియు ఇతర లింక్స్ తో దరఖాస్తు చేసుకోండి.
Note: పైన తెలిపిన అన్ని వివరాలు చూసుకున్న తర్వాత అర్హతలు కలిగినటువంటి వారు గడువులోగా వెంటనే దరఖాస్తులు చేసుకోండి
