Thalliki Vandanam Scheme 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తల్లికి వందనం పథకం 2025 కు సంబంధించి మరొక కీలక సమాచారం వచ్చింది. గతంలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు డిపాజిట్ కాని వారికి మరొక అవకాశం కల్పిస్తూ ఎవరికైతే డబ్బులు డిపాజిట్ కాలేదు వారి కోసం ప్రభుత్వం అధికారికంగా మరొకసారి ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 13 2025వ తేదీలోగా ఎవరికైతే తల్లికి వందనం పథకం కింద డబ్బులు డిపాజిట్ కాలేదు వాళ్ళు మళ్ళీ వెరిఫై చేసుకొని సచివాలయంలో సరిచూసుకొని వారి యొక్క అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ అయ్యే విధంగా చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. కావున బడికి పిల్లల్ని పంపిస్తున్న తల్లులు వెంటనే ఈ ఆర్టికల్ ద్వారా పూర్తి సమాచారం తెలుసుకొని తల్లికి వందనం పధకం డబ్బులను పొందే విధంగా ప్రయత్నం చేయండి.
తల్లికి వందనం పథకం అంటే ఏమిటి?:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటవ తరగతి నుండి 12వ తరగతి వరకు స్కూల్ మరియు కాలేజీలకు వెళ్తున్న విద్యార్థిని మరియు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో వారికి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఒక్కో విద్యార్థికి ₹13,000/- రూపాయల చొప్పున తల్లుల ఖాతాల్లో డిపాజిట్ చేసి, పిల్లల చదువులకు ఆర్థికంగా సహాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 2025 లో ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పిల్లలను చదివించడానికి తల్లులకు ఆర్థిక స్తోమత కల్పించడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
తల్లికి వందనం పథకం మొత్తం డిపాజిట్ అయ్యే డబ్బులు ఎంత?:
తల్లికి వందనం పధకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి విద్యార్థికి మొత్తం ₹15,000/- తల్లుల ఖాతాలో డిపాజిట్ చేయనుంది. అయితే
పోస్టల్ శాఖలో పరీక్ష లేకుండా 309 ఉద్యోగాలు విడుదల: Apply
- తల్లి ఖాతాలో: ₹13,000/-
- స్కూల్ లేదా కాలేజీ మెయింటెనెన్స్ కోసం : ₹2,000/- కట్ చేస్తారు.
- ఒక పిల్లవాడికి అయితే : ₹13,000/-
- ఇద్దరు పిల్లలు స్కూల్ కి వెళ్తుంటే : ₹26,000/-
- ముగ్గురు పిల్లలు స్కూల్ కి వెళ్తుంటే : ₹39,000/-
ఇలా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పథకం కింద తల్లి యొక్క ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేస్తారు.
తల్లికి వందనం పథకం డబ్బులు డిపాజిట్ కాకపోవడానికి గల ముఖ్యమైన కారణాలు:
రెవెన్యూ డిపార్ట్మెంట్లో టెన్త్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు : Apply
- తప్పు ఎకౌంట్ నెంబర్ లేదా IFSC కోడ్ తప్పుగా ఇచ్చినట్లయితే డిపాజిట్ కావు
- తల్లి యొక్క బ్యాంకు ఖాతా ఈ ఇన్ యాక్టివ్ లో ఉన్నట్లయితే డిపాజిట్ కావు.
- ఆధారుని బ్యాంకుతో లింక్ చేయనట్లయితే
- ఆధార్ లోని వివరాలు ఇతరు డాక్యుమెంట్స్ లో వివరాలు mismatch అయితే
- గ్రామ వార్డు సచివాలయంలో అప్డేట్ కానీ రికార్డులు
పైన తెలిపిన కారణాలవల్ల తల్లుల ఖాతాలో తల్లికి వందనం పధకం డబ్బులు డిపాజిట్ కావడం లేదు.
ప్రభుత్వం తాజాగా ఇచ్చిన కొత్త ఉత్తర్వుల వివరాలు?:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి కొత్తగా ఉత్తర్వులను జారీ చేసింది. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ₹18000 స్కాలర్షిప్స్ ఇస్తున్నారు: Apply
- నవంబర్ 13, 2025వ తేదీలోగా తల్లులు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయంలో సరి చూసుకోవాలి.
- గ్రామ వార్డు సచివాలయంలో తల్లి యొక్క వివరాలను అప్డేట్ చేసుకోవాలి.
- ఆధార్ మరియు బ్యాంకు లింక్ స్టేటస్ సరి అయిందో లేదో చెక్ చేసుకోవాలి.
- తల్లి యొక్క బ్యాంకు అకౌంట్ నెంబర్ మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ సరిచూసుకొని అప్డేట్ చేయించాలి.
పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?:
తల్లికి వందనం పథకం 2025 కి సంబంధించిన పేమెంట్ స్టేటస్ ని ఈ క్రింది విధానంలో చెక్ చేసుకోవచ్చు.
- మీరు ఫాస్ట్ గా చెక్ చేసుకోవాలి అంటే వాట్సాప్ మనమిత్ర సర్వీసెస్ ద్వారా వెంటనే తెలుసుకోవచ్చు.
- ముందుగా తల్లులు మీ యొక్క వాట్సాప్ లో 955230009 నంబర్ కి హాయ్ అని మెసేజ్ చేయండి.
- అక్కడ తల్లికి వందనం పథకం అనే సర్వీస్ ని ఎంచుకోండి.
- తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.
- పేమెంట్ వివరాలు కనిపిస్తాయి.
- అక్కడ మీ యొక్క పేమెంట్ వివరాలు కనిపిస్తే మీ అకౌంట్లోకి డబ్బులు డిపాజిట్ అవుతాయి.
- Not Found/ineligible అని కనిపిస్తే మీకు డబ్బులు డిపాజిట్ కావు.
NBM పోర్టల్ ద్వారా ఎలా చూసుకోవాలి?:
- NBM పోర్టల్ (https://gsws-nbm.ap.gov.in/NBM) ద్వారా తెలుసుకోవచ్చు.
- ముందుగా పైన ఇచ్చిన వెబ్సైట్ ను ఓపెన్ చేయండి.
- తల్లికి వందనం పథకం ఆప్షన్ ని ఎంచుకోండి.
- తల్లి యొక్క ఆధార్ నెంబర్ మరియు ఓటీపీ ఎంటర్ చేయండి.
- వెంటనే స్క్రీన్ పైన మీరు ఈ పథకానికి అర్హులా కాదా అనేది చూపిస్తుంది.
ముఖ్యమైన సమాచారం?:
మీకు తల్లికి వందనం పధకం డబ్బులు డిపాజిట్ కాలేదు అంటే కచ్చితంగా 100% మీ బ్యాంక్ ఖాతాలో సమస్య ఉండే అవకాశం ఉంది. ఆధార్ బ్యాంకు లింకు చేసిన అకౌంట్ కి మాత్రమే డబ్బులు డిపాజిట్ అవుతాయి.
Note: నవంబర్ 13, 2025వ తేదీలోగా మీ యొక్క మొత్తం వివరాలు అప్డేట్ చేయకపోతే పేమెంట్ నిలిపివేయబడే అవకాశం ఉంటుంది.
తల్లికి వందనం పథకం అర్హతలు?:
- మహిళా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి.
- మహిళ యొక్క పిల్లలు ప్రభుత్వా లేదా ప్రైవేట్ పాఠశాల మరియు కాలేజీలో చదువుతున్న వారే ఉండాలి.
- ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్ లింకు చేయడం తప్పనిసరి.
- ప్రభుత్వ ఉద్యోగస్తుల కుటుంబాలకు ఈ పథకం వర్తించదు.
Note: ప్రభుత్వం కల్పిస్తున్న ఈ చివరి అవకాశం ఎంతో ముఖ్యమైనది కావున ప్రతి ఒక్కరు, మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి గడువులోగా మీ యొక్క వివరాలు అన్నీ కూడా సరిచూసుకోండి.
