Revenue Dept. Notification 2025:
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీస్ ఆఫ్ ది కస్టమ్స్ ఆఫ్ కమిషనర్ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూ శాఖలో పని చేయడానికి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో అర్హులైన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చే విధంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తం 18 పోస్టులు ఉన్నాయి. సీ మ్యాన్, గ్రీజర్ , ట్రేడ్స్ మాన్, సీనియర్ స్టోర్ కీపర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతితో పాటు కొన్ని సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఐటిఐ లేదా డిప్లమా లాంటి అర్హతలు కలిగినటువంటి వారికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు. అయితే నోటిఫికేషన్ కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ చేసే విధానం, ఇతర వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు:
ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైనటువంటి పోస్టుల వివరాలను ఈ క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోండి.
| పోస్ట్ పేరు | పోస్టుల సంఖ్య | అర్హతల వివరాలు |
| ట్రేడ్స్ మాన్ | 03 | టెన్త్ తో పాటు ఐటిఐ సర్టిఫికెట్ ఉండాలి |
| సీ మ్యాన్ | 11 | పదవ తరగతి అర్హత |
| గ్రీజర్ | 04 | పదవ తరగతి అర్హత |
| సీనియర్ స్టోర్ కీపర్ | 01 | పదవ తరగతి అర్హత |
Note : పైన తెలిపిన పోస్టుల వివరాలను మీరు అధికారిక నోటిఫికేషన్ లో కూడా చూసి తెలుసుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి?:
రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనిష్టంగా 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ , ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యుడి అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సికింద్రాబాద్ రైల్వే లో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు : 10th అర్హత
దరఖాస్తు ఫీజు?:
కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. రిజర్వేషన్ ఉన్నవారు అలాగే రిజర్వేషన్ లేని వారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక చేసే విధానం?:
రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఉద్యోగాలకు ఈ కింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా ఎంపిక చేస్తారు.
ఏపీ ఆడబిడ్డ నిధి పథకం తాజా సమాచారం : Full Details
- ముందుగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
- పాత పరీక్షలో అర్హత పొందిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
- ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.
- తర్వాత మెడికల్ టెస్ట్లు నిర్వహించి
- అర్హులైన అభ్యర్థులకు కస్టమ్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:
అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.
- ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి
- ముందుగా ఆన్లైన్లో అప్లై చేసి తర్వాత నోటిఫికేషన్ లోని అప్లికేషన్ ని ప్రింట్ అవుట్ తీసి అది పూర్తి చేసి.
- నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కు పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ పంపించాలి.
- పోస్టల్ చార్జెస్ అందరికీ వర్తిస్తాయి.
ఎంత శాలరీ ఉంటుంది?:
కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన గ్రూప్ సి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹35,000/- నుండి ₹50,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున శాలరీతో పాటు ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా చెల్లించడం జరుగుతుంది.
TTD సంస్థ SVU లో పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు: Apply
దరఖాస్తు గడువు?:
ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఈ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 15వ తేదీ 2025 వరకు సమయం కేటాయించారు. కావున అర్హులైన అభ్యర్థులు గడువులోగా దరఖాస్తులు చేసుకోగలరు
Notification & Application Form
Note: పైన తెలిపిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చూసి మీకు అర్హతలు ఉన్నట్లయితే నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానంలో నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సబ్మిట్ చేయండి.
