School, College Holidays In November 2025:
తెలంగాణలోని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం, నవంబర్ 10 11 14 తేదీలలో నగరంలోని ప్రభుత్వ స్కూల్స్ మరియు ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించడం జరిగింది. ఈ సెలవులు ఆ రోజుల్లో పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉండడం వల్ల ఆ సంస్థలను పోలింగ్ కేంద్రాలు మరియు ఓట్ల లెక్కింపు కార్యాలయాలుగా ఉపయోగించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉండటం వల్ల, ఈ సెలవులు ప్రకటించినట్లుగా జిల్లా కలెక్టర్ అధికారులకు తెలియజేశారు.
ఎందుకు సెలవులు ప్రకటించారు?:
హైదరాబాద్ నగరంలో జరగబోయే జూబ్లీహిల్స్ నియోజకవర్గం యొక్క ఉపఎన్నిక నేపథ్యంలో ఈ క్రింది కారణాల చేత 3 రోజులు సెలవు ప్రకటించడం జరిగింది.
- పోలింగ్ కేంద్రాలుగా స్కూళ్లు మరియు కళాశాలను ఉపయోగించడం.
- పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో ఏర్పాటు చేయడం కోసం
- ఎలక్షన్ కి కావాల్సిన మెటీరియల్ ని తరలించడం కోసం.
- అధికారిక సిబ్బంది మొబిలైజేషన్ కోసం
పైన తెలిపిన కారణాల చేత నవంబర్ 10 11 14 తేదీలలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మూడు రోజులు సెలవులు ప్రకటించారు.
సెలవుల తేదీలు ఈ విధంగా ఉన్నాయి:
నవంబర్ నెలలో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు ఆరు రోజులు సెలవులు : Full Details
- నవంబర్ 10: పోలింగ్ జరిగే తేదీ
- నవంబర్ 11: పోలింగ్ అనంత కార్యకలాపాల కోసం సెలవు ప్రకటించారు.
- నవంబర్ 14: ఓట్ల లెక్కింపు తేదీ.
Note: పైన తెలిపిన మూడు రోజుల్లో హైదరాబాద్ జిల్లాలో మాత్రమే సెలవులు ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో యధావిధిగా స్కూల్స్ మరియు కాలేజీలు నిర్వహించడం జరుగుతుంది.
ఎవరెవరికి ఈ సెలవులు వర్తిస్తాయి?:
హైదరాబాద్ నగరంలోని ఈ క్రింది తెలిపినటువంటి సంస్థలకు సెలవులు ప్రకటించారు.
సికింద్రాబాద్ రైల్వే లో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు: 10th అర్హత
- ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు
- జూనియర్ కళాశాలలు
- డిగ్రీ కళాశాలలు
- పోలింగ్ నిర్వహించడం కోసం ఉపయోగించే ప్రభుత్వ కార్యాలయాలు
ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు చదువుతున్న వారికి ₹18,000/- స్కాలర్షిప్స్ ఇస్తున్నారు: Apply
పేరెంట్స్ మరియు స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయాలు:
- మూడు రోజులు స్కూలు మరియు కాలేజీలకు రిలాక్సేషన్ ఉంటుంది.
- ఎగ్జామ్ రాసేవారు స్కూల్ నుండి వచ్చే అప్డేట్స్ తెలుసుకోవాలి.
- పోలింగ్ ప్రాంతాల వద్ద ట్రాఫిక్ మరియు రద్దీ ఎక్కువగా ఉంటుంది.
కావున హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ మరియు కాలేజీల విద్యార్థులు మూడు రోజులపాటు తరగతులకు హాజరు కావాల్సిన అవసరం లేదు. మరింత సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.
