Secunderabad Railway notification 2025 :
సికింద్రాబాద్ లోని సౌత్ సెంట్రల్ రైల్వే నుండి 31 పోస్టులతో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. టెన్త్ మరియు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు నటువంటి పురుషులు మరియు మహిళా అభ్యర్థులు స్పోర్ట్స్ కోటాలో అర్హత కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే స్పోర్ట్స్ ట్రయల్స్ టెస్ట్ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు కావున ప్రతి ఒక్కరూ పూర్తి వివరాలు చూసి అర్హతలు కలిగి ఉన్నట్లయితే వెంటనే నిర్ణీత గడువులోగా దరఖాస్తులు చేసుకోగలరు.
నోటిఫికేషన్ లోని పోస్టుల వివరాలు:
సౌత్ సెంట్రల్ రైల్వే నుండి విడుదలైనటువంటి స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోండి.
| అంశము | వివరాలు |
| పోస్టుల పేర్లు | స్పోర్ట్స్ కోట గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలు |
| ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ | సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్ |
| అర్హతలు | 10th, 10+2 అర్హతతో పాటు స్పోర్ట్స్ విభాగంలో సర్టిఫికెట్స్ ఉండాలి |
| పయోపరిమితి | 18 నుండి 25 సంవత్సరాలు |
| ఆఖరి తేదీ | నవంబర్ 24, 2025 |
| అధికారిక వెబ్సైట్ లింక్ | Click Here |
ఎంత వయస్సు ఉండాలి?:
సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వే నుండి విడుదలైన స్పోర్ట్స్ కోట గ్రూప్ డి మరియు గ్రూప్ సి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో కొంత సడలింపు కూడా ఉండే అవకాశం ఉంది.
నవంబర్ లో AP, TS స్కూల్స్ హాలిడేస్ లిస్ట్
కావలసిన అర్హతల వివరాలు :
సౌత్ సెంట్రల్ రైల్వే నుండి విడుదలైన స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకు అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవాలి అంటే పదవ తరగతి మరియు 10+2 అర్హతతో పాటు నోటిఫికేషన్ లో తెలిపిన స్పోర్ట్స్ విభాగాలలో పాల్గొని అర్హతలు పొందిన వారై ఉండాలి. ఒలంపిక్ గేమ్స్ నేషనల్ గేమ్స్ స్టేట్ యూనివర్సిటీ గేమ్స్ లాంటి ఈవెంట్లలో పాల్గొని మొదటి మూడు స్థానాలు సాధించినటువంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
అప్లికేషన్ దరఖాస్తు ఫీజు వివరాలు :
రైల్వే స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది ఫీజును చెల్లించాలి.
- SC, ST, WOMEN, MINORITIES, EWS: ₹500/-
- Other candidates : ₹250/-
TTD SVU లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు: Apply
ఎంపిక చేసే విధానం :
సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఈ క్రింది విధంగా సెలక్షన్ చేస్తారు.
- ముందుగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తు ఫారాలను స్క్రుటిని చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయినా అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు
- స్పోర్ట్స్ విభాగాల్లో ట్రయల్ టెస్టులు నిర్వహిస్తారు.
- మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
- అర్హతలు ఉన్నవారికి సికింద్రాబాద్ రైల్వే జోన్ లోని పలు లొకేషన్స్ లో పోస్టింగ్ ఇస్తారు
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన వారికి నెలకు ₹45,000/- జీతాలు చెల్లిస్తారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున అన్ని అలవెన్స్ కూడా ఉంటాయి.
నోటిఫికేషన్, ఇతర ముఖ్యమైన లింక్స్:
సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లై లింక్స్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేయనుకోగలరు.
పైన తెలిపిన వివరాల ప్రకారం అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు నోటిఫికేషన్ తెలిపిన గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు.
