విద్యార్థులకు గుడ్ న్యూస్: నెలకు ₹1,000/- స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు: Apply Now

NMMS Scholarships 2025:

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త. విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (NMMS) దరఖాస్తు గడువును అధికారులు మరికొద్ది రోజులు పొడిగించారు.

కొత్త దరఖాస్తు గడువు తేదీలు:

తాజా ప్రకటన ప్రకారం, ఈ స్కాలర్షిప్స్ కి దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు అక్టోబర్ 14వ తేదీ వరకు ఆఖరు గడువును పొడిగిస్తూ అధికారులు నిర్ణయించడం జరిగింది. అర్హత కలిగిన విద్యార్థులు నిర్దిష్ట సమయానికే తమ ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించాలని ఫోటో సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ వారు తెలిపారు.

నెలకు ₹1000/- స్కాలర్షిప్:

NMMS స్కీం కింద ఎంపికైన విద్యార్థులకు ప్రతినెల ₹1000 రూపాయలు చొప్పున స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది. ఈ స్కాలర్షిప్స్ ని తొమ్మిదవ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇవ్వబడుతుంది. అంటే ఒక విద్యార్థికి మొత్తం ఈ నాలుగు సంవత్సరాలలో 48 వేల రూపాయలు స్కాలర్షిప్ రూపంలో పొందవచ్చు. కాబట్టి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు కచ్చితంగా ఈ స్కాలర్షిప్స్ కోసం దరఖాస్తులు చేసుకోగలరు.

Join Whats App Group

ఎవరు దరఖాస్తు చేసుకోవాలి?:

  1. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  2. కుటుంబ వార్షిక ఆదాయం ₹3,50,000/- మించి ఉండకూడదు.
  3. ఎనిమిదో తరగతిలో 55 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అయితే 50% మార్కులు ఉన్న అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకునే విధానం?:

  • ముందుగా అధికారిక వెబ్సైట్ (www.bse.telangana.gov.in) ని ఓపెన్ చేయండి
  • NMMS 2025 Application” లింకుపై క్లిక్ చేయండి
  • విద్యార్థుల యొక్క పూర్తి వివరాలు దరఖాస్తు ఫారంలో నింపి, అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి చివరగా అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
  • అప్లికేషన్ సబ్మిట్ చేసి చివరగా ప్రింట్ అవుట్ తీసుకోండి.

పరీక్ష తేదీలు ఎప్పుడు?:

NMMS స్కాలర్షిప్ పరీక్షను డిసెంబర్ 2025లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి అవి ఏమనగా.

  1. మెంటల్ ఎబిలిటీ టెస్ట్
  2. స్కాలర్షిప్ ఆప్టిట్యూడ్ టెస్ట్

official website link

ఈ స్కాలర్షిప్స్ కి అర్హత కలిగిన విద్యార్థిని విద్యార్థులు అక్టోబర్ 14వ తేదీలోగా పైన ఇచ్చినటువంటి సమాచారం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకొని, అధికారిక వెబ్ సైట్ లోనికి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి వెంటనే దరఖాస్తు సబ్మిట్ చేయండి.