AP Inter Exams 2026 Time Table:
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ 2026 మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షల షెడ్యూల్ ని ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ అధికారికంగా విడుదల చేయడం జరిగింది. విద్యాశాఖ విడుదల చేసిన ఈ టైం టేబుల్ ని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు కచ్చితంగా తెలుసుకోవాలి. పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా చూడండి.
AP Inter Exams 2026 Time Table:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల టైం టేబుల్ ఈ క్రింది విధంగా ఉంది. పూర్తి వివరాలు చూడండి.
- పరీక్షలు ప్రారంభమయ్యే తేదీ: ఫిబ్రవరి 23, 2026
- మొదటిరోజు పరీక్ష : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర విద్యార్థులకు లాంగ్వేజ్ పేపర్ తో పరీక్షలు ప్రారంభమవుతాయి.
- రెండవ రోజు పరీక్ష: ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర విద్యార్థులకు లాంగ్వేజ్ పేపర్ 2 తో పరీక్షలు ప్రారంభమవుతాయి.
- పరీక్ష సమయం: ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు.
- ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షల ఆఖరి తేదీ : 24th మార్చ్, 2026
- ఇంటర్ రెండవ సంవత్సర పరీక్షల ఆఖరి తేదీ : 23rd మార్చ్, 2026
- ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ PDF: Download
ముఖ్యమైన విషయాలు:
- ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుండి మార్చి 23 మరియు 24వ తేదీ వరకు నిర్వహిస్తారు.
- అన్ని సబ్జెక్టుల పరీక్షలను ఉదయం పూట మాత్రమే నిర్వహిస్తారు.
- పరీక్షల టైం టేబుల్ పిడిఎఫ్ ను అధికారికి వెబ్సైట్లో గాని లేదా పైన ఇచ్చినటువంటి లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
- విద్యార్థుల యొక్క హాల్టికెట్లను పరీక్ష జరగడానికి ముందు కాలేజ్ యాజమాన్యం ద్వారా గాని లేదా బోర్డు అధికారికి వెబ్సైట్లో కాని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు సూచనలు:
- విద్యార్థులు పరీక్ష హాల్ నందు పరీక్షకు 30 నిమిషాల ముందే హాజరుకావలెను.
- విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్ మరియు అవసరమైనటువంటి స్టేషనరీ ని తప్పనిసరిగా తీసుకురావాలి
- మొబైల్ ఫోన్స్ మరియు ఎలక్ట్రానిక్స్ పరికరాలు అనుమతించబడవు
- విద్యార్థులు రివిజన్కు ఎక్కువ సమయం కేటాయించాలి.
గమనిక:
2026 లో జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలను ఇంటర్మీడియట్ బోర్డ్ కఠినంగా నిర్వహించినట్లు తెలిపింది. కాబట్టి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈసారి జరగబోయేటువంటి పరీక్షలకు చాలా సీరియస్ గా ప్రిపేర్ కావలసి ఉంటుంది. Andhra Pradesh intermediate 2026 exams time table విద్యార్థులకు ఒక చక్కటి దిశా నిర్దేశం చేస్తుంది.
