రేపు భారత్ బంద్: స్కూల్స్, కాలేజెస్, బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ఉంటుందా? లేదా?

Bharat Bundh 2025:

దేశవ్యాప్తంగా రేపు జూలై 9, 2025న భారీ ఎత్తున భారత్ బంద్ నిర్వహించనున్నారు. ఈ భారత్ బంద్ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. దాదాపుగా 25 కోట్ల మంది ఉద్యోగులు ఈ ఉద్యమంలో పాల్గొననున్నాయని సమాచారం.ఇంత పెద్ద బంద్ కు గల కారణాలు ఏమిటి?, రేపు జరగబోయే భారత్ బంద్ కు స్కూల్స్, కాలేజెస్ , బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులు పని చేస్తాయా లేదా?. పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ బంద్ కు ఎవరు పిలుపునిచ్చారు?:

రేపు జరగబోయే భారత్ బంద్ కు పిలుపునిచ్చిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Join WhatsApp Group

  • జాయింట్ ఫారం ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో (JFTU) వివిధ ఉద్యోగ సంఘాలు బందుకు పిలుపునిచ్చారు.
  • ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ రైల్వేలు , డిఫెన్స్, టెలికాం, బ్యాంకింగ్ , ఎడ్యుకేషన్, పోస్టల్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు ఇందులో భాగం కానున్నారు.

భారత్ బంద్ కు గల కారణాలు?:

ఈ క్రింది అంశాలపై నిరసనగా భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.

రైల్వే NTPC 2025 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల అప్లికేషన్ స్టేటస్ విడుదల చేశారు

  1. కార్మికుల హక్కులకు హాని చేసే కార్మిక విధానాలు
  2. సామూహిక బేరసారాలు మరియు సమ్మె వంటి హక్కులను తగ్గించే నాలుగు కొత్త కార్మిక కోడ్ ల కోసం ఒత్తిడి తేవడం.
  3. పెరుగుతున్న నిరుద్యోగం మరియు ద్రవయోల్బణం
  4. ఆరోగ్యం, విద్యా మరియు పౌర సౌకర్యాలలో కోతలు.
  5. యువతకు ఉద్యోగాలు భర్తీ చేయకుండా, వారికి బదులుగా ప్రభుత్వం పదవీ విరమణ చేసిన వారిని నియమించుకోవడం.
  6. పది సంవత్సరాల్లో కార్మిక సదస్సులు జరగకపోవడం.
  7. వలస కార్మిక హక్కులను తొలగించే ప్రయత్నం చేయడం.
  8. ప్రజా భద్రతా బిల్లులను ఉపయోగించి నిరసనలపై అణచివేత చేయడం వంటివి ప్రధాన కారణాలు.

బంద్ వల్ల ప్రభావితం అయ్యే సంస్థలు :

ఈ భారత్ బంద్ దాదాపు అన్ని రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఏపీ పాలీసెట్ 2025 సీట్ అలాట్మెంట్ ఫలితాలు విడుదల

  • బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ సర్వీసెస్
  • పోస్టల్ ఆపరేషన్స్
  • కోల్ మైనింగ్ మరియు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్
  • రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నడిపించే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్
  • గవర్నమెంట్ ఆఫీసర్ మరియు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్
  • రూరల్ ప్రాంతాల్లో రైతులు నిరసన తెలిపే అవకాశం ఉంది.

పైన తెలిపిన ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఇతర సంస్థలు మూతపడే అవకాశం ఉంది

బంద్ ప్రభావం చూపని సంస్థలు?:

రేపు జరగబోయే భారత్ బంద్ ఈ క్రింది తెలిపిన సంస్థలపై ప్రభావం చూపకపోవచ్చు.

తెలంగాణ ఐసెట్ 2025 ఫలితాల్లో ఎంత ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలో సీటు వస్తుంది

  1. ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ మరియు కాలేజీలు ఓపెన్ లోనే ఉండే అవకాశం ఉంది (ఖచ్చితంగా చేపోయలేం).
  2. ప్రైవేట్ ఆఫీసెస్ యధావిధిగానే కొనసాగుతాయి
  3. ట్రైన్ ప్రయాణాలపై ఎటువంటి బంద్ లేదు. కానీ, కొన్ని ట్రైన్లు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది.

ప్రజలకు ముఖ్యమైన సూచనలు:

  • అత్యవసర ప్రయాణాలు ఉంటే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి
  • బ్యాంకింగ్ మరియు రైల్వే వంట సేవలు కొంతవరకు అంతరాయపడే అవకాశం ఉంది.
  • కొన్ని రాష్ట్రాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా నిలిచిపోయే అవకాశం ఉంది.
  • కావున బంద్ ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రజల అప్రమత్తంగా ఉండాలి

ముఖ్యమైన సమాచారం:

  1. బంద్ నిర్వహించే తేదీ : జూలై 9, 2025
  2. బందుకు పిలుపునిచ్చిన సంస్థ: జాయింట్ ట్రేడ్ యూనియన్
  3. పాల్గొననున్న సంస్థలు : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ సెక్టార్ రైల్వే, బ్యాంకింగ్, పోస్టల్ తదితర ప్రభుత్వ సంస్థల 25 కోట్ల మంది ఉద్యోగులు.

జూలై 9న నిర్వహించే భారత్ బంద్ ఒక పెద్ద స్థాయి ఉద్యమంగా మారే సూచనలు ఉన్నాయి.ప్రజలు ముందస్తుగానే తమ పనులను ప్లాన్ చేసుకోవాలి. ప్రభుత్వం వీరి యొక్క డిమాండ్లపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.