RRB NTPC 2025 – 12th Level:
భారత ప్రభుత్వం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, గత సంవత్సరం సెప్టెంబర్ లో విడుదల చేసిన రైల్వే ఎన్టిపిసి అండర్ గ్రాడ్యుయేట్ 2024 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ కి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో, వారి యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి సంబంధించిన నోటీస్ ని ఈరోజురైల్వే బోర్డు అధికారులు విడుదల చేశారు.ఆ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ని జూలై 8, 2025 నుండి చెక్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది. దాదాపుగా 4,000 వరకు ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి 30 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 8,2025వ తేదీ నుండి కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు నిర్వహించనున్నారు. కావున ఈ ఆర్టికల్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవాలో చూడండి.
రైల్వే NTPC 2025 అండర్ గ్రాడ్యుయేట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలు:
- రైల్వే NTPC అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో సెప్టెంబర్ 20, 2024న నోటిఫికేషన్ విడుదల చేశారు.
- అప్లికేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు:
- మీ యొక్క అప్లికేషన్స్ ప్రొఫెషనల్ గా అంగీకరించబడ్డాయా?
- లేకపోతే తిరస్కరించబడ్డాయా అనే వివరాలను ఇప్పుడు తెలుసుకోవచ్చు.
- అప్లికేషన్ స్టేటస్ చూసుకునేందుకు అధికారిక వెబ్సైట్ :https://www.rrbapply.gov.in
- అప్లికేషన్ స్టేటస్ లింక్ యాక్టివేట్ అయిన తేదీ: 08.07.2025.
అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?:
ఏపీ ఆడబిడ్డ నిధి పథకం 2025 మార్గదర్శకాలు విడుదల. ఇలా అప్లై చేయండి
- అప్లికేషన్ స్టేటస్ లో చెక్ చేసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి.
- మీ యొక్క యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి
- అక్కడ మీరు దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ యొక్క స్టేటస్ చూపించబడుతుంది.
- Provisionally accepted అయితే, మీరు ఈ పరీక్ష రాయడానికి అర్హులు
- Rejected అయితే, మీరు ఈ పరీక్ష రాయడానికి అర్హత లేని వారు.
- మీ మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి కి కూడా మీ యొక్క స్టేటస్ వివరాలు వస్తాయి.
Railway NTPC UG 2025 Application Status Link
Railway NTPC 2025 application status notice
రైల్వే NTPC అండర్ గ్రాడ్యుయేట్ 2025 పరీక్షలు ఎప్పుడు?:
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు ప్రారంభ తేదీ : ఆగస్టు 7, 2025
- కంప్యూటర్ ఆధారిత రాధా పరీక్షలు ఆఖరి తేదీ : సెప్టెంబర్ , 8 2025
- స్పష్టమైన షెడ్యూల్ ఇటీవల విడుదల చేయడం జరిగింది మీరు అధికారిక వెబ్సైట్లో షెడ్యూల్ చూసుకోవచ్చు.
5 ఏపీ పాలీసెట్ 2025 సీట్ అలాట్మెంట్ ఆర్డర్ రిజల్ట్స్ విడుదల
అభ్యర్థులకు రైల్వే ముఖ్య సూచనలు:
- రైల్వే అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టిపిసి పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకోవాలని రైల్వే బోర్డు సూచించింది.
- అధికారిక రైల్వే వెబ్సైట్స్ కాకుండా ఇతర వెబ్సైట్స్ లో ఉన్న సమాచారాన్ని చూసి నమ్మవద్దని, మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే వాటిని నివృత్తి చేసుకోవడానికి రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదించాలని సూచించారు.
