TG RGUKT IIIT Basara 2025:
తెలంగాణ బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ త్రిబుల్ ఐటీలో ప్రవేశాల కోసం 2025లో దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు యొక్క మెరిట్ లిస్టు ఫలితాలను ఈరోజు అనగా జూలై 4వ తేదీ సాయంత్రంలోగా విడుదల చేయనున్నారు. దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు దాదాపు 40 వేల నుండి 50,000 మధ్య ఉండవచ్చని అంచనా. మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకున్న విద్యార్థులు అందులో వారి యొక్క పేర్లు ఉన్నట్లయితే సంబంధిత తేదీలలోగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలి. బాసర త్రిబుల్ ఐటీ 2025 మెరిట్ లిస్టు ఫలితాలను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
IIIT బాసర 2025 మెరిట్ లిస్టు ఫలితాలు విడుదల తేదీ?:
తెలంగాణలోని త్రిబుల్ ఐటీ బాసర 2025 మెరిట్ లిస్ట్ ఫలితాలను జూలై 4వ తేదీ సాయంత్రంలోగా విడుదల చేయనున్నారు.ఇది అధికారికంగా ఉన్నత విద్యా మండలి ప్రకటించిన రిజల్ట్స్ విడుదల తేదీ. ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిటెక్ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారి యొక్క మెరిట్ ఫలితాలను డౌన్లోడ్ చేసుకొని వారి పేరు ఉన్నట్లయితే సర్టిఫికెట్ల పరిశీలకు హాజరు కావాలి.
మెరిట్ లిస్టు ఫలితాలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా తెలంగాణ త్రిబుల్ ఐటీ బాసర 2025 మెరిట్ లిస్టు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
10th లో ఎన్ని మార్క్స్ వస్తే IIIT Basara లో సీట్ వస్తుంది
- ముందుగా తెలంగాణ త్రిబుల్ ఐటీ బాసర 2025 అధికారిక వెబ్సైట్ (Website Link)ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజ్ లో “TG IIIT Basara 2025 Merit List Results” ఆప్షన్ ని ఎంచుకోండి
- లింకు పైన క్లిక్ చేసిన వెంటనే మెరిట్ లిస్ట్ PDF మీకు డౌన్లోడ్ అవుతుంది.
- ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
- మెరిట్ లిస్టు పిడిఎఫ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం
FAQ’s:
1. తెలంగాణ బాసర త్రిబుల్ ఐటీ 2025 మెరిట్ లిస్ట్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి?
https://www.rgukt.ac.in/admissions2025.html వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు.
2. మొత్తం ఎంతమంది తెలంగాణ బాసర త్రిబుల్ ఐటీ 2025 అడ్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు?
అంచనా ప్రకారం దాదాపుగా 50వేల వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
3. మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన వారికి, ఎప్పుడు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు?
సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించినటువంటి తేదీలు తర్వాత డిపార్ట్మెంట్ వారు వెల్లడిస్తారు.అదేది రోజున విద్యార్థులు ఒరిజినల్సబ్మిట్ చేయాలి.
