AP DSC 2025 New Hall Tickets:
ఆంధ్రప్రదేశ్ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ ఆరో తేదీ నుండి నిర్వహిస్తున్న ఏపీ డీఎస్సీ పరీక్షల్లో భాగంగా జూన్ 20 మరియు 21 తేదీల్లో రద్దు చేసినటువంటి పరీక్షలను జూలై 1 మరియు 2వ తేదీలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ తేదీలలో పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ డీఎస్సీ అధికారులు కొత్తగా ఈరోజు హాల్ టికెట్లను విడుదల చేశారు. జూలై 1 మరియు 2వ తేదీల్లో పరీక్షలు రాసే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలి. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
ఈ కొత్త హాల్ టికెట్స్ ఎవరు డౌన్లోడ్ చేసుకోవాలి?:
జూన్ 20 మరియు 21వ తేదీల్లో యోగాంధ్ర సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి డీఎస్సీ పరీక్షలను ఆ రెండు రోజులు వాయిదా వేస్తూ జూలై 1 మరియు 2వ తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. కాబట్టి వాయిదా పడిన అపరీక్షలకు సంబంధించి ఆ రెండు రోజుల్లో పరీక్షలు రాయవలసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని జూలై 1 2వ తేదీల్లో పరీక్షలకు హాజరు కావలసిందిగా ఏపీ డీఎస్సీ అధికారులు తెలిపారు.
కొత్త హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
ఏపీ డీఎస్సీ 2025 జూలై 1 మరియు 2వ తేదీల్లో జరిగేటువంటి పరీక్షలు యొక్క హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఎందుకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.
AP DSC 2025 కొన్ని పరీక్షల ప్రాథమిక కీలు విడుదల: Download
- ముందుగా ఏపీ డీఎస్సీ 2025 అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్ళండి
- వెబ్సైట్ హోం పేజ్ లో ” AP DSC 2025 download hall tickets ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ మరియు ఇతర వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- వెంటనే స్క్రీన్ పైన అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది
- అది ప్రింట్ అవుట్ తీసుకొని పరీక్షకు హాజరవ్వండి.
- హాల్ టికెట్లో ఉన్న పరీక్ష కేంద్రం మరియు పరీక్ష సమయం వివరాలను చెక్ చేసుకొని, పరీక్షకు ఇచ్చిన సమయంలోగా హాజరవ్వండి.
FAQ’s:
1. ఈ కొత్త హాల్ టికెట్లను ఎవరు డౌన్లోడ్ చేసుకోవాలి?
జూలై 1,2వ తేదీల్లో పరీక్షలు రాయిపోయే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి.
2. ఏపీ డీఎస్సీ 2025 పరీక్షల యొక్క ప్రాథమిక కీ విడుదల చేశారా?
కొన్ని పోస్టులకి సంబంధించిన ప్రాథమిక కీ లను ఆల్రెడీ అధికారికి వెబ్సైట్లో విడుదల చేయడం జరిగింది. వివరాల కోసం వెబ్ సైట్ ని ఓపెన్ చేసి చెక్ చేయండి
