AP Annadhatha Sukhibhava Scheme 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సోదరులకు పెద్ద శుభవార్తని అందించింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ పథకంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ పథకాన్ని కొత్తగా ప్రారంభించడానికి నిర్ణయించింది.ఈసారి రైతులకు ఒక్కసారిగా 20 వేల రూపాయలు చెల్లించేందుకు కార్యాచరణ రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి ఈ మొత్తం డబ్బులను విడుదల చేయనున్నట్లు సమాచారం.
విడతల వారీగా ₹20,000/- రూపాయలు విడుదల చేసే తేదీలు:
| మొత్తం విడతలు | మంజూరైన మొత్తం |
| జూన్ 2025 ( నెలాఖరకు) | ₹2,000/- కేంద్ర ప్రభుత్వం + ₹5,000/- రాష్ట్ర ప్రభుత్వం |
| అక్టోబర్ 2025 | ₹7,000/- |
| జనవరి 2026 | ₹6,000/- |
| మొత్తం డబ్బులు | ₹20,000/- |
ఈ పథకానికి ఎవరు అర్హులు?:
AP PGCET 2025 ఫలితాలు ఈరోజు విడుదల
- రాష్ట్రంలోని చిన్న మరియు మధ్య తరహా రైతులు అర్హులు
- పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నవారు
- గతంలో రైతు భరోసా గాని లేదా అన్నదాత సుఖీభవ లేదా పీఎం కిసాన్ పథకం పొందినవారు
- ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ లింకు చేసిన వారు అర్హులు
ఈ పథకము యొక్క ముఖ్య లక్ష్యం:
- వ్యవసాయం చేయడానికి ఆర్థిక ఇబ్బందులలో ఉన్న రైతులకు ఆర్థిక సాయం అందించడం
- విత్తనాలు, ఎరువులు, సస్యరక్షణలో మందులను వాడడానికి కావలసిన ఊరట
- రైతుల లోన్ పై ఆధారపడే పరిస్థితిని తగ్గించడమే ముఖ్యమైన లక్ష్యం
లబ్ధిదారుల జాబితా ఎలా చెక్ చేసుకోవాలి?:
RRB NTPC 2025 ప్రాథమిక ఆన్సర్ కి మరియు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్కులు
అన్నదాత సుఖీభవ పథకం అర్హుల జాబితాను రెండు విధాలుగా చెక్ చేసుకోవచ్చు.
విధానం 1:
- ముందుగా https://annadathasukhibhava.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజ్ లో “check Status Now” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- లబ్ధిదారుడి యొక్క ఆధార్ నెంబర్ లేదా పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేయండి
- “Get Details” పై క్లిక్ చేస్తే, మీరు ఈ పథకానికి అర్హులా కాదా అనే స్టేటస్ చూపిస్తుంది.
విధానం 2:
- మీరు లబ్ధిదారులు అయినట్లయితే మీ దగ్గరలోని గ్రామ సచివాలయానికి వెళ్లి అన్నదాత సుఖీభవ పథకం అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి
- గ్రామ సచివాలయం అధికారుల వద్ద లేటెస్ట్ అప్డేటెడ్ అర్హుల జాబితా పిడిఎఫ్ ఉంటుంది. అందులో వివరాలు చూసుకోండి
- మీ ఆధార్ నెంబర్ ద్వారా సులభంగా వివరాలను చూసుకోవచ్చు.
AP Annadhatha Sukhibhava Website
అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే విడతల వారీగా, మొత్తం మూడు విడతల్లో మీ ఖాతాలో డబ్బులు డిపాజిట్ అవుతాయి . అర్హుల జాబితాలో లేనివారు మళ్లీ కొత్తగా అప్లై చేయడానికి సబ్మిట్ చేయవలసినటువంటి వివరాలను గ్రామ సచివాలయంలోని అధికారులను అడిగి తెలుసుకుని, కడుపులోగా ఆ పత్రాలు సబ్మిట్ చేసినట్లయితే మీకు అర్హత లభిస్తుంది. అప్పుడు మీ అకౌంట్ లో కూడా అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు డిపాజిట్ అవుతాయి.
