RRB NTPC 2025 గ్రాడ్యుయేట్ రాత పరీక్షలు ముగిసాయి: ఆన్సర్ కీ విడుదల తేదీ, Expected Cut Off Marks వివరాలు చూడండి

RRB NTPC 2025 Graduate Exams:

దేశవ్యాప్తంగా జూన్ 5వ తేదీ నుండి 24వ తేదీ వరకు నిర్వహించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (RRB NTPC 2025) పరీక్షలు ముగిశాయి. కొన్ని లక్షల మంది ఈ పరీక్షలను షిఫ్టులవారీగా రాశారు. అయితే వారంతా ఇప్పుడు ప్రాథమిక ఆన్సర్ కి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రాథమిక ఆన్సర్ కీని జూన్ 28వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాథమిక ఆన్సర్ కీ లను ఆర్ఆర్బీ రీజినల్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రాథమిక ఆన్సర్ కీ లను డౌన్లోడ్ చేసుకుని, వారికి ఎన్ని మార్కులు వచ్చాయో చెక్ చేసుకుని అభ్యంతరాలు ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే సబ్మిట్ చేయవచ్చు. ప్రాథమిక ఆన్సర్ కీ చేసుకున్న తర్వాత ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ కేటగిరీల వారీగా ఎంత ఉంటుందో కూడా ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

ప్రాథమిక ఆన్సర్ కి విడుదల తేదీ?:

Join Whats App Group

  • ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల తేదీ : జూన్ 28, 2025
  • డౌన్లోడ్ చేసుకునే వెబ్సైట్లు?: రీజినల్ ఆర్ఆర్బీ వెబ్సైట్ ల నుండి డౌన్లోడ్ చేసుకోవాలి ( ఉదాహరణ: rrbsecunderabad.gov.in)
  • ఏ ఫార్మేట్ లో ఉంటుంది: ప్రశ్న పేపర్, ఎంపిక చేసిన ఆప్షన్,సరైన సమాధానం. ఇవి ప్రాథమిక ఆన్సర్ కి రెస్పాన్స్ షీట్స్ లో ఉంటాయి
  • అబ్జెక్షన్ల ప్రక్రియ : ప్రాథమిక ఆన్సర్ కిలో ఏమైనా తప్పులు గమనించినట్లయితే అభ్యర్థులు కొంతమేర ఫీజు చెల్లించి అబ్జెక్షన్లను సబ్మిట్ చేయాలి.

RRB NTPC 2025 Graduate Level Exam: Expected Cut Off Marks:

రైల్వే NTPC 2025 గ్రాడ్యుయేట్ లెవెల్ రాత పరీక్షలకు క్యాటగిరి వారిగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్కులు ఎంత ఉండొచ్చో ఈ క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోండి.

TS LAWCET, PGLCET 2025 ఫలితాలు విడుదల: Check Here

CategoryExpected Cut Off Marks
UR (General)72-78 మార్కులు
OBC66-72 మార్కులు
SC60-65 మార్కులు
ST54 – 60 మార్కులు
EWS65-71 మార్కులు

• Note: పైన తెలిపిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్కులు, మొత్తం పోస్టుల సంఖ్య, పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య, పేపర్ల యొక్క డిఫికల్టీ లెవెల్ ని బట్టి మరియు గత సంవత్సరాల కటాఫ్ మార్కులను ఆధారంగా చేసుకుని ప్రిపేర్ చేయడం జరిగింది.

ప్రాథమిక కీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

రైల్వే NTPC 2025 గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షల ప్రాథమిక కీని ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

  1. ముందుగా అభ్యర్థులు సంబంధిత రీజినల్ వెబ్సైట్లను (https://rrbsecunderabad.gov.in/) ఓపెన్ చేయాలి
  2. వెబ్సైట్ హోం పేజ్ లో “RRB NTPC Graduate Level Exam 2025 Answer Key Download” ఆప్షన్ పై క్లిక్ చేయాలి
  3. అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
  4. అక్కడ అభ్యర్థుల యొక్క రెస్పాన్స్ షీట్ పిడిఎఫ్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకోవాలి.
  5. అందులో ఉన్న ఆన్సర్ కిని చెక్ చేసుకొని, అభ్యంతరాలను సబ్మిట్ చేయాలి.

TS EAMCET 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల తేదీ

RRB NTPC 2025: Important Expected Dates:

అంశముExpected Dates
ఆన్సర్ కి విడుదల తేదీ జూన్ 28, 2025
ఆన్సర్ కి అబ్జెక్షన్ విండోజూన్ 29 – జూలై 2, 2025
ఫైనల్ ఆన్సర్ కిజూలై 2025 మధ్యలో
CBT 2 Stage 2 పరీక్ష తేదీఆగష్టు / సెప్టెంబర్ 2025

RRB NTPC 2025 Answer Key Website

FAQ’s:

1.RRB NTPC 2025 ఆన్సర్ కి ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి?

RRB సికింద్రాబాద్ రీజినల్ వెబ్సైట్ rrbsecunderabad.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోగలరు

2. RRB NTPC 2025 స్టేజ్ 2 రాత పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు?

ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో స్టేజ్ 2 రాత పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.

3. ప్రాథమిక ఆన్సర్ కి విడుదల చేసే తేదీ?

రైల్వే ఎన్ టి పి సి 2025 గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షల ఆన్సర్ కిని జూన్ 28వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది.