TS High Court Exams 2025:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జనవరి, 2025 లో 1673 పోస్టులతో జిల్లా కోర్టులు మరియు హైకోర్టులో పని చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే ఇందులో కొన్ని పోస్టులకు ఏప్రిల్ 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించారు. ఆఫీస్ అపార్ట్మెంట్ , ప్రాసెస్ సర్వర్ వంటి ఉద్యోగాలకు OMR పద్ధతిలో జూన్ 21 మరియు 22 తేదీల్లో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే గతంలో ఏప్రిల్ నెలలో నిర్వహించిన పోస్టులకు సంబంధించినటువంటి పరీక్ష యొక్క ప్రాథమిక కీని అదే నెలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చాలామంది అభ్యర్థులు తెలంగాణ జిల్లా కోర్ట్ మరియు హైకోర్టు మొత్తం ఉద్యోగాలకు సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు విడుదల చేస్తారనేటువంటి సందీప్దంలో ఉన్నారు. ఈ ఫలితాలను జూలై నెలలో ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి తెలంగాణ హైకోర్టు డిపార్ట్మెంట్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. కానీ గత సంవత్సరాల అంచనాల ప్రకారం చూసుకుంటే జూలైలో ఫలితాలు విడుదల చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
తెలంగాణ పరీక్షల షెడ్యూల్?:
తెలంగాణ జిల్లా కోడ్ మరియు హైకోర్టు ఉద్యోగాల పరీక్షలను రెండు దఫాలుగా ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి.
| ఆఫీస్ సబార్డినేట్ , ప్రాసెస్ సర్వర్ పోస్టులకు | జూన్ 21, 22 తేదీలలో నిర్వహించారు |
| మిగిలిన పోస్టులకు | ఏప్రిల్ 15 నుండి 20 వరకు ఆన్లైన్లో నిర్వహించారు |
ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నారు?:
తెలంగాణ జిల్లా కోర్ట్ మరియు హైకోర్టు 1673 పోస్టులకు దాదాపుగా 1,70,000 మంది వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. ఈ పోస్టుల్లో ఎక్కువగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు వెళ్లాయి. తర్వాత ఆఫీస్ అబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ వంటి పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణ స్టేట్ 2025 అతి ముఖ్యమైన మోస్ట్ రిపీటెడ్ ప్రశ్నలు ఇవే
ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు?:
తెలంగాణ హైకోర్టు మరియు జిల్లా కోర్ట్ 1673 పోస్టులకు సంబంధించి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానంలో రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థుల యొక్క ఫలితాలను జూలై నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 15 నుండి 20వ తేదీ వరకు నిర్వహించిన ఆన్లైన్ పరీక్షలు యొక్క ప్రాథమిక కి అని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఫైనల్ కీ ని కూడా విడుదల చేసి ఫైనల్ రిజల్ట్స్ ని వచ్చే నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే హైకోర్టు రిక్రూట్మెంట్ సెల్ నుండి ఇంతవరకు అధికారిక ప్రక్కన జారీ కాలేదు.
TS high court official website
FAQ’s:
1. తెలంగాణ కోర్టు ఆఫీస్ సబార్డినేట్ మరియు ప్రాసెసర్ వారి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎప్పుడు నిర్వహిస్తారు?
ఇంటర్వ్యూ తేదీలను ఇంతవరకు హైకోర్టు వారు విడుదల చేయలేదు.
ఫలితాలు మరియు ఇంటర్వ్యూలకి సంబంధించి ఏదైనా అధికారిక ప్రకటన విడుదలయితే మా వెబ్సైట్ ద్వారా తెలుపడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మా వెబ్సైట్ని ప్రతిరోజు సందర్శించండి.
