AP DSC 2025 Exam:
ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి 16 వేలకు పైగా విడుదల చేసినటువంటి మెగాడీఎస్సీ పోస్టులకు జూన్ ఆరో తేదీ నుండి జూలై రెండవ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పరీక్షలు షిఫ్టులవారీగా జరుగుతున్నాయి. డీఎస్సీ పోస్టుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) ఉద్యోగానికి సంబంధించి క్యాటగిరీలవారీగా గత సంవత్సరాల్లో జరిగిన డీఎస్సీ కట్ ఆఫ్ మార్కులను ఆధారంగా చేసుకొని, ఎవరికి ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుందో ఈ ఆర్టికల్ లోని ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ద్వారా చూసి తెలుసుకుందాం. కట్ ఆఫ్ మార్కుల వివరాల కొరకు పూర్తి ఆర్టికల్ చూడండి.
కట్ ఆఫ్ మార్కులను ప్రభావితం చేసే అంశాలు:
- ప్రశ్నపత్రం యొక్క కఠిన స్థాయి ( paper difficulty level )
- పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య
- జోన్లవారీగా ఖాళీల సంఖ్య
- క్యాటగిరీల వారిగా రిజర్వేషన్ మరియు వెయిటేజీలు
- TET స్కోర్ వెయిటేజీ (20% TET + 80% DSC)
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరైన అభ్యర్థుల సంఖ్య పైన ఆధారపడి ఉంటుంది
AP DSC 2025 కేటగిరీల వారీగా SGT పోస్టుల యొక్క Expected Cut Off Marks (For 100 Marks):
ఏపీ డీఎస్సీ కొన్ని పోస్టులకు ప్రాథమిక ఆన్సర్ కి విడుదల చేశారు
| category name | Expected cut off marks (Out Of 100) |
| OC-Male | 65-70 |
| OC-Female | 63-68 |
| BC-A | 60-65 |
| BC-B | 60-66 |
| BC-C | 58-63 |
| BC-D | 60-65 |
| BC-E | 58-62 |
| SC | 50-55 |
| ST | 45-52 |
| EWS | 62-67 |
| PH (VH/HH/OH) | 35-45 |
Note: కట్ ఆఫ్ మార్కులు జోన్లవారీగా చూస్తే స్వల్పంగా మారవచ్చు. ప్రశ్నపత్రం యొక్క కఠినత్వం, పోటిదారుల సంఖ్య, పోస్టుల విభజన ఆధారంగా తుది కటాఫ్ నిర్ణయించబడుతుంది.
ఏపీ ఆడబిడ్డ నిది పథకం కొత్త మార్గదర్శకాలు విడుదల: ఇలా Apply చెయ్యండి
గత DSC 2018 – SGT పోస్టులకు తుది కటాఫ్ మార్కులు ( రిఫరెన్స్ కోసం):
| క్యాటగిరి | తుది కటాఫ్ మార్కులు |
| OC | 68 |
| BC | 63 |
| SC | 53 |
| ST | 50 |
ఏపీ డీఎస్సీ 2025లో SGT టీచర్ పోస్టులకు పోటీ భారీగానే ఉంది. కాబట్టి ఎస్జీటీ పోస్టులకు పరీక్ష రాసే అభ్యర్థులు 10 నుంచి 15 మార్కులు ఎక్కువ తెచ్చుకునే విధంగా టార్గెట్ పెట్టుకోవాలి. పాత ప్రశ్న పత్రాలు, ప్రాక్టీస్ టెస్ట్ లు, సిలబస్ ప్రకారం స్ట్రాటజిగ్గా ప్రిపేర్ అవ్వాలి.
ప్రాథమిక కి ఎప్పుడు విడుదల చేస్తారు?:
జూలై మొదటి వారం లేదా రెండో వారంలో ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పోస్టులకు పరీక్షలు రాసిన విద్యార్థుల కోసం ప్రాథమిక కీ ని విడుదల చేయడం జరుగుతుంది. అభ్యర్థులకు అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి కొద్ది రోజులు సమయం కేటాయిస్తారు. తర్వాత ఫైనల్ కీ విడుదల చేసి రిజల్ట్స్ కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్టులో పేరు ఉన్నవారికి సర్టిఫికెట్ల పరిశీలన చేసి టీచర్లుగా ప్రభుత్వ పాఠశాలలో పోస్టింగ్ ఇస్తారు.
