అన్నదాత సుఖీభవ అర్హుల జాబితా: మొదటి విడతలో ₹7,000/- జమ: జాబితా ఎలా చూడాలి -eKYC ఎలా చేసుకోవాలి?

Annadhatha Sukhibhava Scheme 2025:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కటైనటువంటి అన్నదాత సుఖీభవ పథకాన్ని జూన్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించింది. అయితే ఈరోజు జూన్ 20వ తేదీ వచ్చినప్పటికీ ఇంతవరకు రైతుల అకౌంట్లో డబ్బులు డిపాజిట్ కాలేదు. అలాగే పిఎం కిసాన్ కి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఇంకా డిపాజిట్ కాలేదు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్లుగా పిఎం కిసాన్ ₹2,000/- రూపాయల డబ్బులతో కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించే ₹5,000 రూపాయలు కూడా కలిపి మొత్తం ₹7,000/- రూపాయల డబ్బులను రైతుల అకౌంట్లో మొదటి విడత కింద జమ చేయడం జరుగుతుందని తెలిపింది. ఇలాగా ఒక సంవత్సర కాలంలో మూడు విడతల్లో డబ్బులు డిపాజిట్ అవుతాయని మొత్తం ₹20 వేల రూపాయలు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో జమ చేసి పంట పెట్టుబడికి సహాయం చేయడం జరుగుతుంది తెలిపారు. కానీ ఇంతవరకు డబ్బులు రిలీజ్ కాలేదు. అయితే లబ్ధిదారుల యొక్క వివరాలు ఎలా చెక్ చేసుకోవాలి, ఈ కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం ఇప్పుడు చూసి తెలుసుకుందాం.

మూడు విడతల్లో డబ్బులు డిపాజిట్ :

అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలో మొత్తం ₹20 వేల రూపాయలు డిపాజిట్ చేస్తారు. మూడు విడతల్లో ఎంత డబ్బులు జమ అవుతాయో క్రింది టేబుల్ ద్వారా చూసి తెలుసుకోండి.

Join WhatsApp group

Phases total amountPM Kisan AmountState AmountMoney Deposit Date
మొదటి విడత₹7,000/-₹2,000/-₹5,000/-జూన్ 20, 2025
రెండవ విడత₹7,000/-₹2,000/-₹5,000/-ఆగష్టు, 2025 (అంచనా )
మూడవ విడత₹6,000/-₹2,000/-₹4,000/-నవంబర్ , 2025(అంచనా)

అర్హుల జాబితా విడుదల – ఇలా చెక్ చేసుకోండి:

  • అన్నదాత సుఖీభవ పథకానికి అర్హుల జాబితా గ్రామ సచివాలయంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది
  • లేదా MAO ( మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ ) కార్యాలయంలో లిస్టు పెట్టే అవకాశం ఉంది.
  • అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్సైట్లో మీ వివరాలను నమోదు చేసి చెక్ చేసుకోవచ్చు.

ఏపీ తల్లికి వందనం పథకం డబ్బులు పడని వారికి ఈ ఒక్క రోజే సమయం: Apply

eKYC స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?:

  1. లబ్ధిదారుల యొక్క ఈ కేవైసీ స్టేటస్ చెక్ చేసుకోవడానికి https://annadathasukhibhava.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోం పేజ్ లో ” beneficiary status ” పై క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేయండి.
  3. అప్పుడు మీ KYC పూర్తయిందా లేదా చూపిస్తుంది
  4. బ్యాంక్ ఎస్ఎంఎస్ లేదా పిఎం కిసాన్ పోర్టల్ లో కూడా చూసుకోవచ్చు

జూన్ 20 డబ్బులు విడుదల ఆలస్యం కానుందా?

అన్నదాత సుఖీభవ మొదటి విడత ₹7,000/- రూపాయలు విడుదలకి సంబంధించి జూన్ 20వ తేదీన డబ్బులు విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. పీఎం కిసాన్ 2000 రూపాయలు డిపాజిట్ అయిన తర్వాత అవి కూడా కలిపి రాష్ట్ర ప్రభుత్వం 5000 రూపాయలతో మొత్తం 7000 రూపాయలు విడుదల చేయాలి. కానీ ఈరోజు జూన్ 20వ తేదీ వచ్చినప్పటికీ రైతుల ఖాతాలో డబ్బులు డిపాజిట్ కాలేదు. అయితే ఈ డబ్బులు ఈరోజు గానీ లేదా మరో రెండు మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కొత్తగా అప్లై చేయాలి అనుకునే వారు ఇలా చేయండి?:

  1. కొత్త దరఖాస్తు ఫారంని పూర్తి చేసి గ్రామ సచివాలయంలో సబ్మిట్ చేయాలి.
  2. మీ అప్లికేషన్ సంబంధిత వ్యవసాయ అధికారి ద్వారా ప్రాసెస్ అవుతుంది

• కావలసిన సర్టిఫికెట్స్:

  • ఆధార్ కార్డ్
  • రైతు యొక్క పట్టాదారు పాస్ పుస్తకం
  • బ్యాంక్ అకౌంట్ వివరాలు
  • మొబైల్ నెంబర్
  • రేషన్ కార్డు వివరాలు

అన్నదాత సుఖీభవ అనే పథకం ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం చేయడానికి ప్రారంభించిన ఒక బృహత్తరమైన కార్యక్రమం. ఈ డబ్బులు త్వరలో విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కసరత్తు చేస్తుంది.