AP Mega DSC 2025 Answer Key:
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు జూన్ 5వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఏపీ మెగాడీఎస్సి 2025 కు సంబంధించి తాజా సమాచారం ప్రకారం ” మైనర్ మాధ్యమ భాషల” ప్రశ్నపత్రాలు ఆన్సర్ కీని జూన్ 17వ తేదీన విడుదల చేసినట్లు కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. కన్నడ, ఒడియా, తమిళం, ఉర్దూ విభాగాలకు సంబంధించిన ప్రాథమిక కీని అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఇప్పటికే పరీక్షల ప్రారంభమయ్యాయి. జూన్ 21వ తేదీన జరగవలసిన డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ను త్వరితగరితిన పూర్తి చేసి రిజల్ట్స్ విడుదల చేసి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సెలెక్ట్ అయినవారికి ఉద్యోగాలు ఇస్తారు.
పరీక్షల వివరాలు ఇలా ఉన్నాయి:
- మొత్తం పోస్టులు : 16,347
- మొత్తం అప్లికేషన్స్: 5,61,000+
- పరీక్షలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు : జూన్ 5వ తేదీ నుండి 30వ తేదీ వరకు
- ప్రాథమిక కీ విడుదల తేదీ: జూన్ 17, 2025.
ప్రాథమిక కి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
AP తల్లికి వందనం పధకం డబ్బులు పడనివారు, ఈ ఫారం సబ్మిట్ చేస్తే 5 రోజుల్లో వస్తాయి
- ముందుగా ఏపీ మెగా డీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://apdsc.apcfss.in/ ఓపెన్ చేయండి
- ” Preliminary key – minor medium” లింకును క్లిక్ చేయండి
- మీ సబ్జెక్టు మరియు మీడియం ను ఎంచుకొని, ప్రాథమిక ఆన్సర్ కీ పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోండి.
- ప్రాథమిక కీలో ఏమైనా తప్పులు గమనించినట్లయితే మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి సమయం కూడా ఇచ్చారు.
పోస్టల్ GDS 2025 4th మెరిట్ List విడుదల: check here
రెస్పాన్స్ షీట్లపై అభ్యంతరాలను ఎలా సబ్మిట్ చేయాలి?:
- ప్రాథమిక కీపిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని అందులో తప్పు సమాధానాలు ఉన్న ప్రశ్నలకు అభ్యంతరాలు పెట్టుకోవాలనుకునే వారు ఆన్లైన్లోనే అబ్జెక్షన్స్ సబ్మిట్ చేయాలి.
- జూన్ 23వ తేదీలోగా అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి సమయం ఇచ్చారు
ముఖ్యమైన సూచనలు:
- అభ్యంతరాల పరిశీలన అనంతరం ఫైనల్ కీ ని విడుదల చేస్తారు
- ఈ ఫైనల్ కీ ఆధారంగానే మెరిట్ లిస్టులో ప్రిపేర్ చేయడం జరుగుతుంది.
- ఫైనల్ రిజల్ట్స్ ని ఎప్పుడు విడుదల చేస్తారో సమాచారం లేదు.
- ఇతర భాషలకు సంబందించిన ప్రాధమిక కీ మాత్రమే విడుదల చేశారు.
- మిగిలిన పరీక్ష ఫలితాలు ఇంకా విడుదల చేయలేదు.
ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి 2025 పరీక్షలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం అధికారకు వెబ్సైట్ ని మరియు మా వెబ్సైట్ ని సందర్శిస్తూ ఉండండి.
