TG TET 2025 Hall Tickets OUT : Download @tgtet.aptonline.in/tgtet/

TG TET 2025 Hall Tickets 2025:

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) 2025 కు సంబంధించి హాల్ టికెట్లను జూన్ 11వ తేదీ ఉదయం విడుదల చేశారు. దాదాపుగా 1.5 లక్షల మంది అభ్యర్థులు ఈ తెలంగాణ టెట్కు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు రోజుకు రెండు విడతల్లో ఉదయం, మధ్యాహ్నం కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వారి యొక్క హాల్ టికెట్ ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ డాక్యుమెంట్తో పాటు ఐడి ప్రూఫ్ ని కూడా తీసుకొని పరీక్ష కేంద్రానికి హాజరు కావలెను. టెట్లో అర్హత పొందినటువంటి వారి నుంచి 20% వెయిటేజీ మార్కులను డీఎస్సీలో కలుపుతారు. కావున టీచర్ అయ్యే అభ్యర్థులకు టెట్ మార్కులు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు TET హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం.

TG టెట్ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

తెలంగాణా టెట్ పరీక్షల హాల్ టికెట్స్ ని అభ్యర్థులు ఈ క్రింది విధంగా, మొబైల్ ఫోన్ లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Join Whats App Group

  1. ముందుగా టెట్ అధికారిక వెబ్సైట్ (TG TET Website) ఓపెన్ చెయ్యండి
  2. వెబ్సైటు హోం పేజీలో “TG TET 2025June Hall Tickets” ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి.
  3. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యండి.
  4. వెంటనే హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి. ప్రింట్ అవుట్ తీసుకోండి.

పరీక్షకు వెళ్లే అభ్యర్థులు, తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్స్:

తెలంగాణ టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింది డాక్యుమెంట్స్ తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి.

తెలంగాణా స్కూల్స్ Reopen డేట్స్ : విద్యా సంవత్సర క్యాలెండర్ విడుదల

  • టెట్ హాల్ టికెట్ హార్డ్ కాపీ
  • ఫోటో ఐడెంటిటీ కార్డ్ (ఆధార్, పాన్, ఓటర్ ID)
  • ఏదైనా ఒక పెన్
  • ట్రాన్సపారంటే వాటర్ బాటిల్

TG TET Hall Tickets Link

FAQ’s:

1. తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ ఏమిటి?

జూన్ 18వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రోజుకి రెండు షిఫ్టుల వారీగా పరీక్షలు జరుగుతాయి

2. తెలంగాణ టెట్ పరీక్షల యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ఏమిటి?

https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు

3. తెలంగాణా టెట్ హాల్ టికెట్స్ ఎప్పటినుండి డౌన్లోడ్ చేసుకోవాలి?

జూన్ 11 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.