AP EAMCET 2025:
ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలు జూన్ 8వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఫలితాలలో 10 వేల లోపు ర్యాంకు తెచ్చుకున్నటువంటి వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుందో తెలుసుకోవాలనే ఒక ఆత్రుత ఉంటుంది. మీ ర్యాంకు తగిన టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు మరియు యూనివర్సిటీలకి సంబంధించినటువంటి పూర్తి జాబితా ఈ క్రింది విధంగా ఉంటుంది. ఇది గత సంవత్సరాల్లో ర్యాంకుల ఆధారంగా స్టూడెంట్స్ పొందినటువంటి కాలేజీల వివరాలను ఆధారంగా చేసుకొని ఈ డేటా ని ప్రిపేర్ చేయడం జరిగింది.
1-5,000 మధ్య ర్యాంకు వచ్చిన విద్యార్థులకు ఏ కాలేజీలలో, యూనివర్సిటీల్లో సీటు వస్తుంది:
• AU రీజియన్ ( ఆంధ్ర యూనివర్సిటీ జోన్):
- ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ,విశాఖపట్నం
- GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాజాం
- గాయత్రీ విద్యా పరిషత్ (GVP), విశాఖపట్నం
- విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
• SVU రీజియన్ ( శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ జోన్):
- శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, తిరుపతి
- శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్, తిరుపతి
- అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాజంపేట
- మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్
ఏపీ ఎంసెట్ లో 5,000 నుండి 1,50,000 మధ్య ర్యాంక్ వచ్చినటువంటి వారికి ఏ కాలేజీల్లో సీటు వస్తుంది
• top deemed universities through convener quota:
- KL యూనివర్సిటీ ( కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ) (Limited Branches)
- విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ (With Scholarship)
5,001 – 10,000 ర్యాంకు వచ్చిన విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్న కాలేజీల వివరాలు:
- VIT – విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విశాఖపట్నం
- రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, నంద్యాల
- SVEC – శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, తిరుపతి
- NBKR ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్యానగర్
- PACE ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఒంగోలు
- RVR & JC కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ,గుంటూరు
- ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్, కాకినాడ
- VSM కాలేజీ.
ఏపీ ఎంసెట్ 2025 ర్యాంకులను మళ్లీ విడుదల చేయనున్నారు : RE-Ranking
1-10,000 ర్యాంకు వచ్చిన వారికి ఎలాంటి బ్రాంచులు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి?:
- CSE, ECE వంటి హైట్ డిమాండ్ బ్రాంచులు, మొదటి 3000 నుండి 5000 మధ్య ర్యాంకు వచ్చినటువంటి వారికే ఈ బ్రాంచ్ లు అందుబాటులో ఉంటాయి.
- CIVIL, MECH, EEE వంటి బ్రాంచ్ లు పదివేల వరకు ర్యాంకులు ఉన్నా కూడా దొరకవచ్చు.
- కొత్తగా వచ్చిన కోర్సులు AIML, Data Science, cyber security వంటి బ్రాంచ్ల్లో కూడా వారికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
మీరు చేయవలసిన పని ఏమిటి?:
- APSCHE కౌన్సిలింగ్ ప్రారంభమయిన తర్వాత – మొదటి రౌండ్ వెబ్ ఆప్షన్స్ జరుగుతున్న సమయంలో, మీరు పైన పేర్కొన్న కోర్సులు మరియు కాలేజీలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి.
- Mock Counselling Tools ఉపయోగించి మీకు వచ్చిన ర్యాంక్ కు తగిన కాలేజీలను ఎంపిక చేసుకోండి.
- ప్రీవియస్ ఇయర్స్ లో ఉన్నటువంటి కటాఫ్ లను పరిశీలించండి. చాలా కాలేజీలను వాటి యొక్క హిస్టరీ ఆధారంగా మంచి అంచనా వేయవచ్చు.
