Telangana 10th 2025-26 calendar:
తెలంగాణ పదవ తరగతి 2025-26 క్యాలెండర్లో ముఖ్యమైన హైలైట్స్ ఇక్కడే విధంగా ఉన్నాయి.
- 2025-26 విద్యా సంవత్సరం యొక్క కాల పట్టిక విడుదల.
- జనవరి 10, 2026 నాటికి 10వ తరగతి సిలబస్ పూర్తి చేయాలని టార్గెట్
- 2026 మార్చి లోనే తెలంగాణ 10వ తరగతి పరీక్షలు.
- సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 10వ తేదీ వరకు దసరా సెలవులు
- డిసెంబర్ 23 నుండి డిసెంబర్ 27 వరకు క్రిస్మస్ సెలవులు
- జనవరి 11 నుండి జనవరి 15 వరకు సంక్రాంతి సెలవులు.
తెలంగాణ ప్రభుత్వం 2025-26 10వ తరగతికి సంబంధించిన విద్యాసంవత్సర క్యాలెండర్ ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం 2026 మార్చ్ లోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఇది చాలా ముఖ్యమైన సమాచారం.
ముఖ్యమైన తేదీలు:
| అంశము | తేదీలు |
| పాఠశాలలు ప్రారంభ తేదీ | జూన్ 12, 2025 |
| టెన్త్ పబ్లిక్ పరీక్షలు 2026 | మార్చ్, 2026 |
| దసరా సెలవులు | సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 10 వరకు |
| క్రిస్మస్ సెలవులు | డిసెంబర్ 23 నుండి 27 వరకు |
| సంక్రాంతి సెలవులు | జనవరి 11 నుండి 15 వరకు |
| విద్యా సంవత్సరం ముగింపు తేదీ | ఏప్రిల్ 23, 2026 |
2025-26 విద్యా సంవత్సర లక్ష్యం ఏమిటి?:
తెలంగాణ విద్యాశాఖ చెప్పిన వివరాల ప్రకారం, జనవరి 10, 2026వ తేదీ నాటికి పదవ తరగతి సిలబస్ ను పూర్తిగా బోధించాలి. దానితోపాటు ప్రతిరోజు తప్పనిసరిగా ఐదు క్లాసులు నిర్వహించాలని సూచించింది. మొత్తంగా 230 పని దినాలు విద్యా సంవత్సరంలో ఉండనున్నాయి.
తెలంగాణ స్కూల్స్ ఓపెన్ డేట్ అధికారిక సమాచారం
ఉపాధ్యాయులకు సూచనలు:
- కాళ్ల పట్టిక ప్రకారం ఉపాధ్యాయులు లెసన్స్ ప్రారంభించాలి.
- ప్రతినెల ఎగ్జామ్స్ , టెస్టులను పకడ్బందీగా నిర్వహించాలి.
- తక్కువ సమయానికే సిలబస్ పూర్తి చేయాలంటే ప్రణాళిక బద్ధంగా క్లాసులు ప్రారంభించాలి.
తల్లిదండ్రులు విద్యార్థులకు సూచనలు:
- పిల్లల ప్రగతి మరియు రోజువారి పాఠశాలల హాజరుపై దృష్టి తల్లిదండ్రులు ఉంచాలి .
- విద్యాశాఖ విడుదల చేసిన డేట్ షీట్ కి అనుగుణంగా ప్రిపరేషన్ చేయించండి.
- హాలిడేస్ ను ఉపయోగపరంగా మారుస్తూ పిల్లలకు రివిజన్ ప్లాన్ చేయించండి
2026 మార్చిలోనే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయని క్యాలెండర్ ద్వారా తెలిసినందున, విద్యార్థులు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ముందుగానే దానికి తగ్గట్టుగా తరగతులను ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు పదవ తరగతి చదవబోయే విద్యార్థి అయితే ఇప్పటి నుంచే మీ యొక్క స్టడీ ప్లాన్ ని సిద్ధం చేసుకోండి.
