Telangana Schools Reopen Date:
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను జూన్ 12వ తేదీ నుండి పునః ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ను విడుదల చేసింది. ఇందులో స్కూల్స్ పది దినాలు, పండుగ సెలవులు, తల్లిదండ్రులు విద్యార్థులకు సూచనలతో కూడినటువంటి వివరాలుఉన్నాయి. స్కూల్స్ రీఓపెన్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ స్కూల్స్ రీఓపెన్ డేట్స్ 2025:
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2025-26 అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం, ఈ క్రింది వివరాలు చూడండి.
- పాఠశాలలు ప్రారంభమయ్యే తేది: జూన్ 12, 2025 (గురువారం)
- అభ్యాస పాఠాలు ప్రారంభమయ్యేది: అదే రోజు నుంచి
- దసరా సెలవులు : అక్టోబర్ 1 నుండి 13వ తేదీ వరకు
- క్రిస్టమస్ సెలవులు: డిసెంబర్ 24 నుండి జనవరి 1, 2026 వరకు
- సంక్రాంతి సెలవులు : జనవరి 12 నుండి 17 వరకు
- వార్షిక పరీక్షలు: ఏప్రిల్ 7 నుండి 18, 2026 వరకు
- విద్యా సంవత్సరం ముగింపు: ఏప్రిల్ 23, 2026.
పుస్తకాల పంపిణీ ఎప్పుడు?:
2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన పుస్తకాల పంపిణీ జూన్ 5వ తేదీ నుండి ప్రారంభమవుతుంది.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల తేదీ
- ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు లభిస్తాయి
- సంబంధిత పాఠశాల ద్వారా పుస్తకాల పంపిణీ జరుగుతుంది.
- ప్రతి విద్యార్థికి టైం టేబుల్ మరియు పుస్తకాల కిట్ అందించడం జరుగుతుంది.
2025-26 ఎకడమిక్ క్యాలెండర్ ముఖ్యాంశాలు:
| ముఖ్యమైన అంశము | తేదీ |
| పాఠశాలలు ప్రారంభ తేదీ | జూన్ 12, 2025 |
| పుస్తకాలు పంపిణీ తేదీ | జూన్ 12, 2025 |
| విద్యా సంవత్సరం ప్రారంభ తేదీ | జూన్ 12, 2025 |
- పైన తెలిపిన తెలంగాణ విద్యాసంవత్సర తేదీలు, తెలంగాణ విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా ఇవ్వబడ్డాయి.
- కొన్ని తేదీలలో మార్పులు అధికారికంగా వచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు స్కూళ్లలో ప్రత్యేక సెలవుల విధానం ఉండవచ్చు.
తల్లిదండ్రులకు, విద్యార్థులకు ముఖ్య సూచనలు:
- తల్లిదండ్రులు మీ పిల్లల స్కూల్ ప్రారంభ తేదీ, టైమింగ్స్ తెలుసుకోండి.
- పుస్తకాల పంపిణీ తేదీ ముందుగానే కన్ఫర్మ్ చేసుకోండి.
- ప్రతిరోజు బాక్స్, యూనిఫామ్, ఐడి కార్డ్ సిద్ధంగా ఉంచండి.
- పిల్లలకు చదువు పట్ల ఆసక్తి కలిగేలా,సానుకూల వాతావరణం కల్పించండి.
- సకాలంలో స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ ని పూర్తి చేసే విధంగావారికి అలవాటుని అభివృద్ధి చేయండి.
నూతన విద్యా సంవత్సరం కి సంబంధించి పిల్లలందరూ స్కూల్స్ కి హాజరయ్యి, మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోండి.
