AP RGUKT IIIT Merit List 2025,:
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ఐఐఐటి నుండి ఈరోజు విడుదల కావలసిన మెరిట్ లిస్ట్ జూన్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు ఆర్జీయూకేటీ అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ వారు నోటీసు విడుదల చేశారు. ఆన్లైన్లో దరఖాస్తులను పెట్టుకోవడానికి సంబంధించిన ఆఖరి తేదీని జూన్ 10వ తేదీ వరకు పొడిగించడంతో, మెరిట్ లిస్ట్ విడుదల తేదీని కూడా జూన్ 20వ తేదీకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది.ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తరువాత, అందిన దరఖాస్తులను ఆర్జీయూకేటీ అడ్మిషన్స్ విభాగం అధికారులు పరిశీలన చేసి పదవ తరగతిలో వచ్చిన మెరిట్ మార్కులు ఆధారంగా మెరిట్ లిస్ట్ని ప్రిపేర్ చేసి జూన్ 20వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది.
ముఖ్యమైన విషయాల:
- ఆర్జీయూకేటీ ఐఐఐటి 2025 మెరిట్ లిస్టు ని జూన్ 20వ తేదీన విడుదల చేయమన్నారు.
- ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకునే ఆఖరి తేదీని జూన్ 10వ తేదీ వరకు పొడిగించడం జరిగింది.
- rk వ్యాలీ, నూజివీడు , ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్లకు వేరువేరు మెరిట్ లిస్టు ఉంటాయి.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి యొక్క లాగిన్ వివరాల ద్వారా మెరిట్ లిస్టు చెక్ చేసుకోవచ్చు.
✅ క్యాంపస్లవారీగా మెరిట్ లిస్టులు సపరేట్ గా విడుదల చేయడం జరుగుతుంది.
AP EAMCET 2025 అప్డేట్ : ఇంటర్ మార్కులు డిక్లరేషన్ లో సరి చూసుకోండి.
- నూజివీడు
- ఆర్కే వ్యాలీ
- శ్రీకాకుళం
- ఒంగోలు
పైన తెలిపిన ఈ నాలుగు ఐఐఐటి క్యాంపస్లకు మెరిట్ లిస్టులు విడుదలవుతాయి. ఈ నాలుగు క్యాంపస్లలో ఏదో ఒక క్యాంపస్ కి దరఖాస్తు చేస్తున్న విద్యార్థులు వారి యొక్క లాగిన్ వివరాలు ద్వారా వెబ్సైట్లో లాగిన్ అయ్యి మెరిట్ లిస్ట్ని సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు
ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ అడ్మిషన్స్ యొక్క తదుపరి ప్రకటనల కోసం, కౌన్సిలింగ్ తేదీలు సీటు అలర్ట్ మెంట్ కి సంబంధించిన సమాచారం కోసం తరచూ అధికారిక వెబ్సైట్ ని సందర్శించండి.
గమనిక: NCC, స్పోర్ట్స్, PH, CAP వంటి స్పెషల్ కేటగిరీల అభ్యర్థుల యొక్క మెరిట్ లిస్టులు వేరువేరు తేదీల్లో విడుదలవుతాయి మీరు గమనించగలరు.
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ’
ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మే 20వ తేదీతో ముగిసినప్పటికీ, మరి కొంతమంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ జూన్ 10వ తేదీ వరకు ఆఖరి తేదీని పొడిగించారు. కావున ఇంకా దరఖాస్తు చేసుకొని అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే జూన్ 10వ తేదీలోగా అప్లికేషన్స్ ఆన్లైన్లో ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి.
