ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు 25 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ అందించే విధంగా ఒక గొప్ప పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి ప్రజల ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానల్స్ అమర్చబడతాయి. ఈ పథకం పేరు ‘పీఎం సూర్యఘర్ ముప్తి బిజిలీ యోజన'(PM Suryaghar Muft Bijili Yojana). చాలామంది కుటుంబాలపై కరెంటు భారం పడకుండా చేసే ఈ పథకం యొక్క వివరాలు, అర్హతలు, దరఖాస్తు చేసుకునే ప్రక్రియ గురించి ఇప్పుడు పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
ఈ పథకంలో ముఖ్య అంశాలు:
- పథకం పేరు: ‘పీఎం సూర్యఘర్ ముప్తి బిజిలీ యోజన’
- కరెంటు బిల్లుల నుంచి విముక్తి పొందవచ్చు
- అర్హులైన నివాస్ యొక్క ఇంటి పైకప్పు పై సోలార్ ప్యానల్స్ అమర్చబడతాయి
- దీని ద్వారా ఆ కుటుంబానికి 25 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ లభిస్తుంది
- దీనితోపాటు అదనంగా ప్రభుత్వమే Upfront ఖర్చులు కూడా భరిస్తుంది.
- ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరాలని ఉంది
ఈ పథకానికి ఎవరు అర్హులు?:
‘పీఎం సూర్యఘర్ ముప్తి బిజిలీ యోజన’ పథకం ద్వారా మీరు సోలార్ ప్యానల్స్ ని పొందాలంటే ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
ఏపీలో తల్లికి వందనం పథకం ప్రారంభ తేదీ వచ్చేసింది: ఇవి వెంటనే సబ్మిట్ చేయండి
- 250 యూనిట్లకు లోబడి విద్యుత్ను వినియోగించే కుటుంబాలు అర్హులు
- ఆ కుటుంబం యొక్క ఆదాయపరిమితి సంవత్సరానికి ₹1.5 లక్షల లోపు ఉండాలి
- రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, EV చార్జింగ్ స్టేషన్లు, గ్రూప్ హౌసింగ్ సొసైటీలు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంత ఖర్చు అవుతుంది?:
- రెండు కిలో వాట్ల సోలార్ ప్యానల్స్ ధర : ₹1.10లక్షలు ఉంటుంది.
- ఇందులో కేంద్రం ఇచ్చే సబ్సిడీ: ₹60,000/-
- రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ : ₹20,000/-
- ఈ పథకం లబ్ధి పొందే గ్రహీత యొక్క భారం: సుమారుగా ₹30,000 మాత్రమే
ఎంత విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది?:
- రెండు కిలో వాట్ల సోలార్ ప్యానల్స్ ద్వారా నెలకు సగటున 200 నుండి 240 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.
- ఇది మధ్యతరగతి మరియు దిగువ తరగతి కుటుంబాలకు సరిపడినంత విద్యుత్ ని ఉత్పత్తి చేసి ఇస్తుంది.
- అదనంగా 50 యూనిట్లు వినియోగం వస్తే చార్జ్ ₹117/- మాత్రమే ఉంటుంది.
పథకానికి దరఖాస్తు ఎలా చేసుకోవాలి?:
‘పీఎం సూర్యఘర్ ముప్తి బిజిలీ యోజన’ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ క్రింది విధానాన్ని ఫాలో అవ్వండి.
ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ రీఓపెన్ డేట్ ఇదే: తల్లిదండ్రులు, విద్యార్థులకు ముఖ్య సూచనలు
- ఈ పథకానికి మీ ప్రాంతీయ జిల్లా కార్యాలయంలో గాని లేదా అధికారిక వెబ్సైట్లో గాని అప్లై చేసుకోవాలి
- ఆధార్ కార్డ్, లబ్ధిదారుని బ్యాంకు పాస్ బుక్, ఇంటి పట్టా పత్రాలు సిద్ధం చేసుకోవాలి
- అధికారులు వచ్చి ఇంటిని పరిశీలించాక అన్ని వివరాలు కరెక్ట్ గా ఉన్నట్లయితే మీకు సోలార్ ప్యానల్స్ ని అమర్చుతారు.
ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏమిటి?
- ప్రజలు విద్యుత్ ఖర్చుల నుండి విముక్తి పొందవచ్చు
- పర్యావరణహితమైన జీవనశైలి ఉంటుంది.
- మధ్యతరగతి కుటుంబాలకు దీర్ఘకాలిక ఉపశమనం కలుగుతుంది
- దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగం తగ్గుతుంది.
PM Suryaghar Muft Bijili Yojana: Official Website
ఈ పథకం గురించి మీకు తెలిసిన వారందరికీ సమాచారం అందించి, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మధ్యతరగతి అలాగే దిగువ మధ్యతరగతి కుటుంబాలు లబ్ధి పొందే విధంగా సహకరించాల్సిందిగా ప్రార్థన. ఇలాంటి ప్రభుత్వ పథకాల వివరాల కోసం మా వెబ్సైట్ Www.freejobsintelugu.com నీ సందర్శించండి
