AP అన్నదాత సుఖీభవ పథకం 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024 ఎన్నికల హామీల్లో ఒకటైనటువంటి అన్నదాత సుఖీభవ పథకాన్ని (Annadatha Sukhibhava PM Kisan Scheme 2025) ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తోంది. రైతుల సంక్షేమం కోరి అర్హులైన రైతుల అకౌంటుల్లో ₹20,000/- డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని జూన్ 12వ తేదీ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పథకానికి రైతులకు ఉండవలసిన అర్హతలు, కావలసిన, సర్టిఫికెట్స్ ఎలా అప్లై చేయాలి అనేటువంటి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
పథకానికి కావలసిన అర్హతలు:
- రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి
- ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన చిన్న మరియు సన్నకారు రైతులు అర్హులు.
- వయసు 18 సంవత్సరాలు నిండిన వారై ఉండాలి
- భూమికి సంబంధించిన పక్కా పత్రాలు మరియు పట్టాదారు పాసు పుస్తకం కలిగి ఉండాలి.
- రైతు పేరు ఆధార్ తో అనుసంధానమై ఉండాలి
- రైతు పండించే పంటలు వివరాలు నమోదు చేయాలి.
- భూమిని లీజుకు తీసుకున్న కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులు కాబట్టి వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పథకానికి ఎవరు అనర్హులు:
తల్లికి వందనం పథకం ప్రారంభ తేదీ వచ్చేసింది : వెంటనే అప్లై చేయండి
- ఆదాయపు పన్ను అనగా ఇన్కమ్ టాక్స్ చెల్లించేవారు అనర్హులు
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు
- ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు
- ₹10వేలు, అంతకంటే ఎక్కువ పింఛన్ పొందేవారు
- ఒకే కుటుంబంలో ఇద్దరు నుంచి నలుగురు పేరిట భూమి ఉంటే వారిలో ఒకరికి మాత్రమే పథకం వస్తుంది.
అవసరమైన ధ్రువపత్రాలు:
- రైతు ఆధార్ కార్డ్
- భూమి యొక్క పట్టాదారు పాసుపుస్తకం
- రైతు యొక్క బ్యాంకు పాస్ బుక్
- మొబైల్ నెంబర్
- భూమి యొక్క వివరాలు అనగా సర్వేనెంబర్
- రైతు యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
- ఆధార్ కార్డు నెంబర్ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవాలి
దరఖాస్తు చేసుకునే విధానం:
- అర్హులైన రైతులు తమ యొక్క ఆధార్ కార్డ్, బ్యాంకు పాస్ బుక్, పట్టాదారు పాసుపుస్తకం వివరాలతో రైతు భరోసా కేంద్రాల్లో అధికారులను సంప్రదించాలి
- అక్కడి సిబ్బందికి రైతులు వివరాలు అందించాలి
- సిబ్బంది ఆ రైతు యొక్క పూర్తి వివరాలు చూసి అర్హుడా కాదా అనేది తేల్చిన తర్వాత వారి యొక్క పేరును నమోదు చేయాలి
- ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా ఇచ్చేటువంటి నిధులు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా మూడు విడతలుగా రైతు యొక్క ఖాతాలో జమ అవుతాయి.
మొత్తం సాయం వివరాలు:
- ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా : ₹6,000/-
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నుండి అదనంగా : ₹14,000/-
- మొత్తం: ₹20,000/-
జూన్ 12వ తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని మళ్లీ పునః ప్రారంభించే అవకాశం ఉన్నందున, అర్హులైన రైతులు పైన తెలిపినటువంటి వివరాలను ఆధారంగా చేసుకొని అన్ని సర్టిఫికెట్లు రెడీ చేసుకోండి.
స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?:
- అధికారిక వెబ్సైట్ https://annadathasukhibhava.ap.gov.in ఓపెన్ చేయండి
- know your status ఆప్షన్ పై క్లిక్ చేయండి
- మీ ఆధార్ కార్డు నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, స్క్రీన్ పై కనిపిస్తున్న కాప్చ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- ఆ తర్వాత సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే, రైతు దరఖాస్తుకు సంబంధించిన స్టేటస్ చూపిస్తుంది.
ఈ పథకం ప్రభుత్వం సూచించిన విధివిధానాలపై ఆధారపడి ఉంటుంది. కాలానుగుణంగా పథకంలో మార్పులు కూడా చేసే అవకాశం ఉంటుంది కావున రైతులు గమనించగలరు.