TS 10th Supplementary Exams 2025:
తెలంగాణలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలను జూన్ మూడో తేదీ నుండి జూన్ 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సప్లిమెంటరీ పరీక్షల యొక్క హాల్ టికెట్స్ ని అధికారిక వెబ్సైట్లో ఉంచడం జరిగింది. విద్యార్థులు స్కూల్ హెడ్మాస్టర్ ద్వారా గాని లేదా డైరెక్ట్ గా అధికారిక వెబ్సైట్ నుండి హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరు కావలెను. మొత్తం 42,830 మంది సప్లిమెంటరీ పరీక్షకు దరఖాస్తు ఫీజు చెల్లించారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షలను ప్రతిరోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ , పెన్ మాత్రమే తీసుకొని పరీక్ష సెంటర్ కు ముందుగానే చేరుకోవాలి. హాల్ టికెట్స్ ఒక పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాము.
తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షకు దరఖాస్తు ఫీజు చెల్లించిన విద్యార్థులు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ముందుగా విద్యార్థులు మీయొక్క హాల్ టికెట్స్ ని స్కూల్ హెడ్మాస్టర్ నుండి పొందవచ్చు (లేదా)
- తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు అధికారిక వెబ్సైట్ https://bse.telangana.gov.in/ నుండి విద్యార్థులు డైరెక్ట్ గా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
- అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి వెబ్సైట్ హోమ్ పేజ్ లో
- సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి
- లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన మీకు హాల్టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి
- అవి ప్రింట్ అవుట్ తీసుకొని అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ చూడండి
TS 10th Supplementary Exams: Hall Tickets Download
FAQ’s:
1. తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరగనున్నాయి?
జూన్ మూడవ తేదీ నుండి జూన్ 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు
2. హాల్ టికెట్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
https://bse.telangana.gov.in వెబ్సైట్ నుండి పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
