AP Polycet 2025:
ఆంధ్రప్రదేశ్లోని డిప్లమా కళాశాలలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 30న నిర్వహించిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాత పరీక్ష ఫలితాలను మే 13వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విద్యార్థులు కౌన్సిలింగ్ తెలియల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. కానీ ఇంతవరకు విద్యా శాఖ వారు ఏపీ పాలీసెట్ 2025 కు సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించలేదు. అయితే ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల కావడం కొద్దిరోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 63 పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ కోర్సులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ కొత్త కోర్సులను కళాశాలలో ఉంచి కౌన్సిలింగ్లో విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా చేయడానికి అఖిల సాంకేతిక భారత విద్యా మండలి (AICTE) అనుమతి తప్పనిసరి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు దరఖాస్తు చేసుకోగా అందులో 63 కళాశాలకు అనుమతి మంజూరు అయింది. అయితే మిగిలిన కళాశాలలు కూడా అనుమతి వచ్చిన తర్వాత ఈ పాలిటెక్నిక్ 2025 కౌన్సిలింగ్ కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఉన్నత విద్యా మండలి శాఖ అధికారులు తెలుపుతున్నారు.
ఏపీ పాలీసెట్ కౌన్సిలింగ్ ఆలస్యానికి గల కారణాలు ఇవే:
ఏపీ పాలీసెట్ 2025 కౌన్సిలింగ్ మరికొద్ది రోజులు ఆలస్యం కానున్నది. దీనికి గల ముఖ్య కారణాల్లో రాష్ట్రంలో మొత్తం 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి కొత్త కోర్సుల కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే కొత్త కోర్సులకు సంబంధించి అఖిల భారత సాంకేతిక విద్య మండలి అనుమతి తప్పనిసరి. అయితే మొత్తం 87 కళాశాలలో 63 కాలేజీలకు మాత్రమే అనుమతి మంజూరు కావడం జరిగింది. మిగిలినటువంటి పాలిటెక్నిక్ కాలేజీలకు కూడా అనుమతి వచ్చిన తర్వాత ఈ కౌన్సిలింగ్ విడుదల చేయాలని ఉన్నత విద్యాశాఖ ఆలోచిస్తోంది. ఈ కారణాలవల్ల ఏపీ పాలీసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల కావడం ఆలస్యం అవుతుందని అధికారులు చెబుతున్నారు.

ఏపీ పాలీసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు?
ఏపీ పాలీసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ని జూన్ మొదటి వారంలోగా విడుదల చేయాలని అధికారులు చేస్తున్నారు. కొత్త కోర్సులకు సంబంధించిన అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదల చేసి ద్రౌపత్రాల పరిశీలన చేసి, విద్యార్థుల నుండి వెబ్ ఆప్షన్స్ తీసుకొని, వారు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఆధారంగా సీట్ అలాట్మెంట్ చేసి తరగతులు ప్రారంభించాలని భావిస్తుంది.
AP పాలీసెట్ 2025 లో మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో ఏ సీటు వస్తుందో వెంటనే తెలుసుకోండి.
FAQ’s:
1. ఏపీ పాలీసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది?
జూన్ మొదటి వారంలోగా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
