AP Police Constable Mains Exam 2025:
ఎట్టకేలకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ జూన్ ఒకటో తేదీన జరగనుంది. మొత్తం 38,910 మంది అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్ నుంచి మెయిన్స్ రాత పరీక్షకు క్వాలిఫై అయ్యారు. మెయిన్స్ రాత పరీక్ష రాయిపోయే అభ్యర్థులకు ఇప్పుడు హాల్ టికెట్స్ ని విడుదల చేస్తూ అధికారిక వెబ్సైట్లో లింక్ యాక్టివేట్ చేయడం జరిగింది.మెయిన్స్ రాత పరీక్ష రాయబోయే అభ్యర్థులు వెంటనే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని మీకు ఇచ్చినటువంటి సెంటర్లో ఎగ్జామినేషన్ కి అటెండ్ కావాలి. మెయిన్స్ రాత పరీక్ష మొత్తం 200 మార్కులకు జరగనుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో ఈ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధించినటువంటి వారికి ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఎంతో కీలకమైనటువంటి రాతపరీక్ష కోసం అభ్యర్థులు ఎంతో కాలమంచి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహిస్తున్నందున అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని ఒకరోజు ముందుగానే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఏ ఏరియాలో ఉంది తెలుసుకొని పరీక్షకు సరైన సమయానికి హాజరు కావాలి.
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష యొక్క హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి :
ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు అర్హులైనటువంటి అభ్యర్థులు హాల్ టికెట్స్ ని క్రింది స్టెప్ వేస్తే ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా ఏపీ పోలీస్ వెబ్సైట్ (APSLPRB Website) ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజీలో ” AP Police mains exam 2025 hall tickets download ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- అభ్యర్థుల యొక్క రోల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన మీ యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ కావడం జరుగుతుంది
- ప్రింట్ అవుట్ తీసుకొని అందులో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్లి పరీక్ష రాయండి.
పైన ఉన్న ఏపీ ఎస్ఎల్పిఆర్బి అధికారిక వెబ్సైట్ నుండి మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు సమయం అయితే కల్పించారు.
FAQ’s:
1. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాత పరీక్ష ఎప్పుడు?
జూన్ 1వ తేదీ ఆంధ్రప్రదేశ్లోని పలు కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నారు
2. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు ఎంతమంది అర్హత పొందారు?
మొత్తం 38,910 మంది అభ్యర్థులు అర్హత పొందారు.
