AP EAMCET 2025 answer key:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్షలో భాగంగా మే 19 మరియు 20 తేదీలలో అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షలకు సంబంధించిన ఎంట్రన్స్ రాత పరీక్ష పూర్తయింది. దాదాపుగా 80 వేల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షని రాశారు. అయితే గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మే 21వ తేదీ ఉదయం ఆన్సర్ కి (AP EAMCET 2025 Answer Key) విడుదల చేయడం జరుగుతుందని జెఎన్టియు అనంతపురం వారు తెలిపారు. అధికారికంగా వచ్చిన ఆన్సర్ కీ కాకుండా ఇతర ఇన్స్టిట్యూట్ వాళ్లు కూడా ఆన్సర్ కి ని విడుదల చేస్తారు కానీ అనంతపూర్ జెఎన్టియు యూనివర్సిటీ వారు విడుదల చేసిన ఆన్సర్ కీ నే ప్రామాణికం. అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఎంట్రన్స్ ఎంసెట్ పరీక్ష రాసిన విద్యార్థులు అధికారిక ఆన్సర్ కి విడుదల చేసిన తర్వాత మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ ని డౌన్లోడ్ చేసుకుని అందులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వాటికి అబ్జెక్షన్స్ పెట్టుకుంటే మీకు మార్కులు కలిసే అవకాశం ఉంటుంది. కావున ఈ పూర్తి ఆర్టికల్ చదివి మీ యొక్క ఆన్సర్ కీ ని డౌన్లోడ్ చేసుకోండి.
అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఆన్సర్ కి విడుదల తేదీ:
ఏపీ ఎంసెట్ 2025 అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఎంట్రన్స్ పరీక్షకు ఆన్సర్ కీ ని మే 21వ తేదీ ఉదయం విడుదల చేయనున్నారు. పరీక్ష రాసిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి ఆన్సర్ కి డౌన్లోడ్ చేసుకొని అబ్జెక్షన్స్ పెట్టుకోండి.
ఏపీ ఎంసెట్ 2025 ఆన్సర్ కి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షల ఆన్సర్ కి ని ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
ఏపీ ఎంసెట్ 2025 అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఆన్సర్ కి డౌన్లోడ్
- ఏపీ ఎంసెట్ అధికారిక వెబ్సైట్ (AP EAMCET 2025 Answer Key) ముందుగా ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోం పేజీలో అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఆన్సర్ కి ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి
- మీ యొక్క ఆన్సర్ కి డౌన్లోడ్ అవుతుంది.
- రెస్పాన్స్ షీట్ లో ఏమైనా ప్రశ్నలకు తప్పుడు ఆన్సర్లు ఉన్నట్లయితే మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోండి మీకు మార్కులు కలుస్తాయి.
AP EAMCET 2025: Official Website
ఆన్సర్ కి చెక్ చేసుకున్న తర్వాత అందులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి మిగిలిన విద్యార్థులు కూడా అవి తెలుసుకొని వాటికి అబ్జెక్షన్ పెట్టుకుంటారు కాబట్టి అందరికీ మార్కులు కలిసే అవకాశం అయితే ఉంటుంది ఎవ్వరూ కూడా మర్చిపోవద్దు.
FAQ’s:
1. ఏపీ ఎంసెట్ 2025 ఇంజినీరింగ్ పరీక్షలు ఎప్పటి నుండి మొదలవుతాయి?
మే 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు
2. ఏపీ ఎంసెట్ ఆన్సర్ కి మరియు ఫలితాలు చూసుకునేందుకు అధికారిక వెబ్సైట్ ఏమిటి?
cets.apsche.ap.gov.in/EAPCET ఈ వెబ్సైట్లో మీరు ఆన్సర్ కి మరియు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు
