AP EAMCET 2025 exam day instructions:
ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ లాంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే ఏపీ ఎంసెట్ 2025 పరీక్షలను మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థుల కోసం హాల్ టికెట్స్ ని విడుదల చేయడం జరిగింది. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న విద్యార్థులు పరీక్షకు వెళ్లే ముందు తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్, కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష రాసేటప్పుడు పాటించవలసిన సూచనలు మరియు గైడ్లైన్స్ కి సంబంధించి ఏపీ ఎంసెట్ ఉన్నత విద్యాశాఖ అధికారులు కొన్ని సూచనలు చేశారు. కావున ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి ఈ సూచనలు పాటించండి. ఏపీ ఎంసెట్ పరీక్షకు 3,05,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.ముందుగా అగ్రికల్చర్ మరియు ఫార్మసీకి సంబంధించి పరీక్షలు జరగనున్నాయి. ఆ తర్వాత ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తారు.
ఏపీ ఎంసెట్ పరీక్షకు తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ :
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ లేదా సర్టిఫికెట్స్ ఎగ్జామినేషన్ హాల్ కి తీసుకుని వెళ్లాలి.
- ఏపీ ఎంసెట్ 2025 పరీక్ష కోసం సబ్మిట్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కాపీ ఉండాలి
- ఇటీవల తీసుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ అంటించిన ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ తీసుకువెళ్లాలి
- కుల ధ్రువీకరణ పత్రం ( క్యాస్ట్ సర్టిఫికెట్ ) అవసరం అనుకుంటే తీసుకెళ్లాలి.
పైన తెలిపిన మూడు సర్టిఫికెట్స్ కచ్చితంగా తీసుకొని వెళ్ళాలి.
పరీక్షకు తీసుకువెళ్లకూడని వస్తువులు:
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ క్రింది తెలిపిన వస్తువులు ఏమీ కూడా తీసుకెళ్లకూడదు.
- లాగ్ టేబుల్స్ , క్యాలిక్యులేటర్స్, డిజిటల్ పెన్స్, వాచెస్, మొబైల్ ఫోన్స్, హాల్ టికెట్ కాకుండా ఇంకా ఏమైనా పెన్ తో రాసి ఉన్న పేపర్స్ తీసుకొని వెళ్ళకూడదు.
హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చెయ్యాలి?:
ఏపీ ఎంసెట్ హాల్ టికెట్స్ ని ఈ క్రింది విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/ ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోం పేజ్ లో డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఆప్షన్ పై చేయండి .
- అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నంబర్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసే సబ్మిట్ చేయండి.
- వెంటనే మీ యొక్క హాల్ టికెట్ స్క్రీన్ పైన డౌన్లోడ్ అవుతుంది దానిని ప్రింట్ అవుట్ తీసుకోండి.
FAQ’s:
1. ఏపీ ఎంసెట్ 2025 రాత పరీక్షలు ఎప్పటినుండి ఎప్పటి వరకు?
మే నెల 19వ తేదీ నుండి 27వ తేదీవరకు నిర్వహించడం జరుగుతుంది.
2. ఏపీ ఎంసెట్ కు మొత్తం ఎన్ని లక్షల మంది అప్లై చేశారు?
మూడు లక్షల అయిదువేలు మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు
