Virat Kohli retires from test cricket:
మరి కొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ తో జరగబోయేటువంటి టెస్ట్ సిరీస్ కి ముందు భారత చెట్టుకి కోలుకోలేని దెబ్బ తగిలింది. తన టెస్ట్ ఫార్మేట్ కు విరాట్ కోహ్లీ గుడ్ బై చెబుతూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల భారత టెస్టు చెట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్టులకు రిటైర్మెంట్ పట్టించిన విషయం తెలిసింది. ఇప్పుడు సీనియర్ ఆటగాడు అయినా కింగ్ కోహ్లీ కూడా టెస్ట్ ఫార్మేట్ కు రిటైర్మెంట్ ప్రకటించి (Virat Kohli retires from test cricket) తన యొక్క అభిమానిని నిరాశ లోకి నెట్టాడు. ఈ మేరకు విరాట్ కోహ్లీ కి సంబంధించిన అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్లో భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టాడు. ఇటీవల తాను కూడా టెస్ట్ ఫార్మేట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు బీసీసీఐకి తెలిపాడు. ఇప్పుడు తన అభిమానులకి భారత జట్టుకి వీడ్కోలు పలుకుతూ అధికారికంగా ప్రకటన జారీ చేయడం జరిగింది.
” 14 ఏళ్ల క్రితం భారత జట్టు టెస్టు జెర్సీని ధరించాలని, ఈ ఫార్మాట్ నన్ను ఎంత దూరం తీసుకొస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదని, ఈ టెస్ట్ ఫార్మేట్ తనను పరీక్షించి తీర్చిదిద్ది ఇంతటి వాడిని చేసిందని బాబోద్వేగమైనటువంటి పోస్ట్ పెట్టడం జరిగింది. తాను తెల్ల జెర్సీలో ఆడడం తనకు ఎంతో ఇష్టమైనటువంటి ఆట అని, సుదీర్ఘమైన కొన్ని సంఘటనలు రోజులు, ఎవరికి కనిపించని చిన్నచిన్న నాతో ఎప్పటికీ ఉంటాయని ఆ పోస్ట్ ద్వారా తాను తెలపడం జరిగింది.
అలాంటి ఎంతో ఇష్టమైనటువంటి ఈ ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ కావడం కొంత బాధాకరమైన విషయమైనప్పటికీ, తాను ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదేనని తెలిపాడు. ఈ ఫార్మేట్ కోసం తాను ఎంతో ఇచ్చాడని, అయితే ఈ ఫార్మేట్ తనకి దాని కంటే కూడా ఎక్కువ తిరిగి ఇచ్చిందని కోహ్లీ ఆ పోస్టులో తెలపడం జరిగింది. ఇప్పుడు మనసునిండా సంతృప్తితో మరియు కృతజ్ఞతా భావంతో దీని నుంచి వైదొలుకుతున్న, ఇక నా జీవితంలో వెనక్కి తిరిగి నా టెస్ట్ కెరియర్ చూసుకుంటే నా ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. ప్రేమతో ఇక సైనింగ్ ఆఫ్ అంటూ తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో వ్రాసుకొచ్చాడు.
కాగా, గత సంవత్సరం t20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ టి20 ఫార్మేట్ కు గుడ్ బై చెప్పడం జరిగింది. ఇప్పుడు టీం లోని ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ అయినటువంటి విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడం చాలా నిరాశను కలిగించే అంశం.
2011 మధ్యలో టెస్ట్ ఫార్మేట్ లోకి అడుగు పెట్టినటువంటి విరాట్ కోహ్లీ ఇప్పటివరకూ 123 టెస్ట్లు ఆడి 9,230 పరుగులు సాధించి రికార్డులు క్రియేట్ చేశాడు. ఈ ఫార్మేట్ లో విరాట్ కోహ్లీ అత్యధిక స్కోరు 254 పరుగులు. టెస్ట్ ఫార్మేట్ లో ఎన్నో రికార్డులు నమోదు చేసిన విరాట్ కోహ్లీ ఆ ఫార్మేట్లో 10 వేల పరుగులు పూర్తి చేయకుండానే వైదొలగడం మరొక బాధాకరమైనటువంటి అంశం.
