AP EAMCET 2025 Hall Tickets Released : How To Download @cets.apsche.ap.gov.in

AP EAMCET 2025 Hall Tickets:

ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ వంటి కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించేటువంటి ఏపీ ఎంసెట్ 2025 కి సంబంధించి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే విధంగా అధికారిక వెబ్సైట్లో లింక్ యాక్టివేట్ చేశారు. మొత్తం 3,05,000 మందికి పైగా విద్యార్థులు ఎంసెట్ రాత పరీక్ష కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఫార్మసీ అగ్రికల్చర్ కి సంబంధించిన విద్యార్థులు 87 వేల మందికి పైగా ఉన్నారు, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన విద్యార్థులు రెండు లక్షల పంతొమ్మిది వేల మందికి పైగా ఉన్నారు. ఏపీ ఎంసెట్ 2025 రాత పరీక్షలను మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఎంసెట్ హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో చూద్దాం.

ఏపీ ఎంసెట్ 2025 ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్షలను రాయబోతున్నటువంటి విద్యార్థులు ఈ క్రింది ముఖ్యమైనటువంటి తేదీలను ఒకసారి తెలుసుకోండి.

Join Whats App Group

  • హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేదీ : మే 12 నుండి మే 27వ తేదీ వరకు
  • అగ్రికల్చర్ మరియు ఫార్మసీ రాతపరీక్ష తేదీ : మే 19 నుండి 20వ తేదీ వరకు
  • ఇంజనీరింగ్ రాత పరీక్ష తేదీలు: మే 21 నుండి 27వ తేదీ వరకు
  • ఏపీ ఎంసెట్ 2025 ఫైనల్ కీ విడుదల తేదీ : జూన్ 5, 2025.

ఏపీ ఎంసెట్ 2025 హాల్ టికెట్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి :

ఏపీ ఎంసెట్ 2025 రాత పరీక్షలను రాసే విద్యార్థులు హాల్ టికెట్స్ ని ఈ క్రింది స్టెప్ వేసే ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

  1. ముందుగా ఏపీ ఎంసెట్ వెబ్సైట్ ( AP EAMCET 2025) ఓపెన్ చేయండి.
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో (AP EAPCET 2025 Hall Tickets) ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యండి
  4. వెంటనే స్క్రీన్ పైన హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది.
  5. హాల్ప్రిం టికెట్ ప్రింట్ అవుట్ తీసుకోండి.

వాట్సాప్ ద్వారా ఎంసెట్ హాల్ టికెట్ డౌన్లోడ్:

ఏపీ ఎంసెట్ 2025 హాల్ టికెట్స్ ని ఇప్పుడు విద్యార్థుల మొబైల్ లోని వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ నుండి ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకోండి.

  • ముందుగా మీ మొబైల్లో వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 సేవ్ చేసుకోండి
  • వాట్సాప్ లో ఆ నంబర్ ఓపెన్ చేసి hai మెసేజ్ పెట్టండి
  • వెంటనే మీకో సర్వీసెస్ అని ఒక మెసేజ్ వస్తుంది
  • దాని పైన క్లిక్ చేసి ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనే ఆప్షన్ click చేయండి
  • అక్కడ ఏపీ ఎంసెట్ 2025 హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటది
  • దాని పైన క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి

AP EAMCET Hall Tickets: Click Here

FAQ’s:

1. ఏపీ ఎంసెట్ 20025 హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డౌన్లోడ్ చేసుకోవాలి?

మే 12వ తేదీ నుంచి 27వ తేదీ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

2. ఏపీ ఎంసెట్ 2025 రాత పరీక్షలకు మొత్తం ఎంత మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు?

మా మూడు లక్షల 5000 మందికి పైగా విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు