AP POLYCET 2025 Final Results | Download Scorecard & Results Now

AP POLYCET 2025 Final Results:

ఆంధ్రప్రదేశ్లోని పాలిటెక్నిక్ కాలేజీలో ప్రవేశాల కోసం నిర్వహించేటువంటి పాలీసెట్ 2025 పరీక్షలకు సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మే 12వ తేదీన విడుదల చేయాల్సినటువంటి పాలీసెట్ 2025 ఫలితాలను మే మూడో వారంలో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 1,45,000 మంది పాలీసెట్ 2025 పరీక్షలను ఏప్రిల్ 30వ తేదీన రాయడం జరిగింది. అయితే ఈ పాలీసెట్ 2025 కి సంబంధించినటువంటి పరీక్ష యొక్క ప్రాథమిక కీని మే ఆరో తేదీన విడుదల చేసి, కీ పై ఉన్నటువంటి అభ్యంతరాలు పెట్టుకున్న తర్వాత ఫైనల్ కీ ని మే 10వ తేదీన విడుదల చేయడం జరిగింది. అయితే ఫైనల్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు కొంతమేర నిరాశే కలిగింది. ఫలితాలు కోసం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. పాలీసెట్ 2025 ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

ఏపీ పాలీసెట్ 2025 ఫలితాలు విడుదల ఎప్పుడు:

ఏపీ పాలీసెట్ 2025 ఫలితాలను మే మూడో వారంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మే 12వ తేదీన విడుదల చేయాల్సినటువంటి ఫలితాలు కొంతమేర ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు వారికి సంబంధించినటువంటి ర్యాంక్ కార్డ్ మరియు రిజల్ట్స్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకునే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Join What’s App Group

ఏపీ పాలీసెట్ 2025 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:

ఏపీ పాలీసెట్ 2025 ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా వారి యొక్క ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

  1. ముందుగా ఏపీ పాలీసెట్ అధికారిక వెబ్సైట్ని (Website Link)ఓపెన్ చేయండి.
  2. వెబ్సైట్ హోం పేజీలో ఏపీ పాలీసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ (AP POLYCET 2025 Final Results)అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ రోల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి
  4. వెంటనే ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.
  5. ఫలితాలు యొక్క ర్యాంక్ కార్డ్ వెంటనే డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి

విద్యార్థులు వారి యొక్క పాలీసెట్ 2025 ఫలితాలు చూసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి ర్యాంక్ వివరాలను క్రింది కామెంట్ సెక్షన్ లో తెలపండి.

AP Polycet 2025 Results Website

FAQ’s:

1. ఏపీ పాలీసెట్ 2025 ఫలితాలు విడుదల అయ్యేది ఎప్పుడు?.

మే మూడో వారంలో పాలీసెట్ ఫైనల్ రిజల్ట్స్ ని విడుదల చేయనున్నారు.

2. ఏపీ పాలీసెట్ 2025 ఫలితాలను ఎలా చూసుకోవాలి?

https://polycetap.nic.in/ ఈ వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి ఫైనల్ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.