TS EAMCET 2025 Answer Key Download:
తెలంగాణ ఎంసెట్ 2025 పరీక్షలు రాసిన విద్యార్థుల్లో ఇంజనీరింగ్ రాత పరీక్ష రాసినటువంటి వారికి ఈరోజు అనగా మే ఆరో తేదీ సాయంత్రం 5:00 గంటలకు ప్రాథమిక ఆన్సర్ కి విడుదల చేయడం జరిగింది. ఇంజనీరింగ్ పరీక్ష రాసినటువంటి విద్యార్థులు సాయంత్రం ఐదు గంటల నుంచి వారి యొక్క ఆన్సర్ కి మరియు రెస్పాన్స్ షీట్ ని డౌన్లోడ్ చేసుకొని, మే 7వ తేదీ సాయంత్రం 5:00 లోగా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే సబ్మిట్ చేసుకోవాలి. అబ్జెక్షన్స్ పెట్టుకున్న విద్యార్థులకు మార్కులు కలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఫార్మసీ మరియు అగ్రికల్చర్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని విడుదల చేయడం జరిగింది. ఆ పరీక్షకు సంబంధించిన అబ్జెక్షన్స్ ని ఈరోజు మధ్యాహ్నం 12 గంటల్లోగా సబ్మిట్ చేయాలి. తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలు మే 15వ తేదీ ఉదయం విడుదల చేయనున్నట్లు జెఎన్టియు అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్ ప్రాథమికకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
TS EAMCET 2025 ఇంజినీరింగ్ పరీక్ష ఆన్సర్ కీ డౌన్లోడ్:
తెలంగాణ ఎంసెట్ 2025 పరీక్షకి 2,20,000 మందికి పైగా దరఖాస్తు చేసుకుంటే అందులో కేవలం 2,07,000+ మంది మాత్రమే ఎంసెట్ పరీక్ష రాశారు. ఈ పరీక్షలు మే రెండవ తేదీ నుంచి నాలుగో తేదీ వరకు జరిగాయి. పరీక్ష రాసిన విద్యార్థులు మే ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి వారి యొక్క ప్రాథమిక ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకొని మే 7వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా అబ్జెక్షన్స్ ని సబ్మిట్ చేయాలి.
ఆన్సర్ కి ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష ఆన్సర్ కిని ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్సైట్ https://eapcet.tgche.ac.in/ ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోమ్ పేజ్ లో డౌన్లోడ్ ఆన్సర్ కి మరియు రెస్పాన్స్ షీట్స్ కి సంబంధించిన లింక్స్ ఉంటాయి
- వాటి పైన క్లిక్ చేసి మీ యొక్క ఆన్సర్ కీ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు
- నీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసే సబ్మిట్ చేయడం ద్వారా విద్యార్థికి సంబంధించిన ఆన్సర్ కి డౌన్లోడ్ అవుతుంది
- ఏమైనా తప్పులు గమనించినట్లయితే అబ్జెక్షన్స్ పెట్టుకుంటే మార్కులు కలిసే అవకాశం ఉంటుంది
అబ్జెక్షన్స్ కి అంత ఫీజు ఉంటుంది?:
తెలంగాణ ఎంసెట్ 2025 ఇంజినీరింగ్, అగ్రికల్చర్ , ఫార్మసీ పరీక్షలు రాసినటువంటి వారిలో ప్రాథమిక ఫ్రీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి విద్యార్థులు ఒక్కో ప్రశ్నకు 500 రూపాయలు ఫీజు చెల్లించి అబ్జెక్షన్ సబ్మిట్ చేయాలి. అబ్జెక్షన్స్ పెట్టుకునేటప్పుడు కరెక్ట్ ప్రూఫ్ తో పెట్టినట్లయితే మీకు మార్కులు కలిసే అవకాశం ఉంటుంది. తద్వారా మీకు మార్పులు కూడా పెరుగుతాయి మీ స్కోర్ కార్డు లో మంచి ర్యాంకు వచ్చే అవకాశం ఉంటుంది.
CBSE 10th, 12th రిజల్ట్స్ డేట్
TS EAMCET 2025 ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు?:
తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలను మే 15వ తేదీ ఉదయం విడుదల చేయనున్నట్లు జెఎన్టియు అధికారులు అధికారికంగా ప్రకటన జారీ చేశారు. విద్యార్థులు మే 15వ తేదీ ఉదయం ఫలితాలను చెక్ చేసుకోవచ్చని తెలపడం జరిగింది.
FAQ’s:
1. తెలంగాణ ఎంసెట్ 2025 ఇంజినీరింగ్ పరీక్ష ప్రాథమికకి విడుదల ఎప్పుడు?
ఇంజనీరింగ్ పరీక్ష ప్రాథమిక కేని మే ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయనున్నారు
2. తెలంగాణ ఎంసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ ఎప్పుడు?
ఎంసెట్ 2025 ఫలితాలను మే 15వ తేదీ ఉదయం విడుదల చేయనున్నారు.
