యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 ఉద్యోగాలు విడుదల : అస్సలు మిస్సవ్వొద్ధు వెంటనే అప్లై చేయండి

UBI Notification 2025:

ప్రభుత్వ రంగ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 500 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలయిన అసిస్టెంట్ మేనేజర్(క్రెడిట్ ), అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు, వయస్సు, సెలక్షన్ ప్రాసెస్ మరియు ఉద్యోగాల వివరాల పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చేయండి.

ఉద్యోగాల వివరాలు:

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ వివరాలు ఈ క్రింది పట్టికలో చూడగలరు.

Join Whats App Group

అంశంవివరాలు
విడుదల చేసిన సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టులు500
పోస్టులు వివరాలు అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్), అసిస్టెంట్ మేనేజర్ (ఐటి )
ఎంత వయసు ఉండాలి22 నుండి 30 సంవత్సరాలు
అధికారిక వెబ్సైట్ లింక్website

మొత్తం ఎన్ని పోస్టులు :

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మొత్తం 500 ఉద్యోగాలను విడుదల చేశారు పోస్టుల వారీగా ఉన్నటువంటి ఉద్యోగ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) : 250 పోస్టులు
  • అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) : 250 పోస్టులు

ఉండవలసిన అర్హతలు:

  1. అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) పోస్టులకు : ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు CA లేదా CMA లేదా CS అర్హత కలిగి ఉండాలి
  2. అసిస్టెంట్ మేనేజర్ (ఐటి) పోస్టులకు: BE, BTECH, MS, MTECH, MSC విభాగాల్లో అర్హతలు కలిగి ఉండాలి.
  3. పైన తెలిపిన అర్హతలతో పాటు అనుభవం కూడా ఉన్నటువంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

ఎంత వయస్సు ఉండాలి?:

UBI స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు జూలై ఫస్ట్ 2025వ తేదీ నాటికి 22 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులు. రిజర్వేషన్ ఉన్న SC, ST, OBC అభ్యర్థులకు బయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

తెలంగాణా 10th ఫలితాలు విడుదల

అప్లికేషన్ ఫీజు వివరాలు:

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి క్యాటగిరి వారిగా ఈ క్రింది దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

  • SC, ST, PWD అభ్యర్థులు: ₹177/- ఫీజు చెల్లించాలి
  • ఇతర అభ్యర్థులు : ₹1180/- ఫీజు చెల్లించాలి

ఆన్లైన్లోనే దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్ :

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

  • కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష
  • గ్రూప్ డిస్కషన్
  • పర్సనల్ ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

శాలరీ వివరాలు :

యుబిఐ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అన్ని అలవెన్స్స్ కలుపుకొని నెలకు ₹85,900/- వరకు జీతాలు చెల్లిస్తారు.

ఉండవలసిన డాక్యుమెంట్స్ :

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

  1. అర్హత ప్రమాణాల సర్టిఫికెట్స్
  2. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
  3. సంతకం స్కాన్ చేసిన డాక్యుమెంట్
  4. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ స్కాన్ చేసిన డాక్యుమెంట్
  5. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ డాక్యుమెంట్.

ఎలా అప్లై చేయాలి:

అర్హతలు వయస్సు ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.

  • ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 30th ఏప్రిల్ 2025
  • ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ: 20th మే 2025

Notification

Apply Online

FAQ’s:

1. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఏపీ, తెలంగాణ వారు అర్హులా?

అన్ని రాష్ట్రాల వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు

2. UBI ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, వయస్సు ఏమిటి?

ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం కలిగి 22 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.

3. యూబీఐ ఉద్యోగాలకు దరఖాస్తు ఆఖరి తేదీ ఏమిటి?

20-05-2025 తేదీలోగా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.