TGSRTC Recruitment 2025:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 3,038 ఖాళీల భర్తీకి సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి పలు రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. మొత్తం 3,038 పోస్టుల్లో 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్, ఎకౌంట్స్ ఆఫీసర్ మరియు మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగినటువంటి వారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంటుంది. అయితే ఈ ఆర్టీసీ ఉద్యోగాలను కొన్ని రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా భర్తీ చేయబోతున్నారు.
రిక్రూట్మెంట్ బోర్డ్స్ వివరాలు :
3,038 ఉద్యోగాలను భర్తీ చేసే రిక్రూట్మెంట్ బోర్డుల వివరాలు
| డ్రైవర్స్ | 2000 | పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు |
| శ్రామిక్స్ | 743 | పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు |
| డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) | 114 | పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు |
| డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) | 84 | పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు |
| డిపో మేనేజర్ / అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ | 25 | TGPSC |
| అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీర్ | 18 | TGPSC |
| అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) | 23 | TGPSC |
| సెక్షన్ ఆఫీసర్ | 11 | TGPSC |
| అకౌంట్స్ ఆఫీసర్ | 6 | TGPSC |
| మెడికల్ ఆఫీసర్ (జనరల్) | 7 | మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు |
| మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) | 7 | మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు |
ఎంత వయసు ఉండాలి :
18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు నటువంటి అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీ చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు మరో ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదల: Check
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి 3,038 338 పోస్టులతో త్వరలో వివిధ రకాల రిక్రూట్మెంట్ పోటీల ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి,ఇంటర్మీడియట్, డిప్లమా,ఐటిఐ వంటి పలు విభాగాల్లో అర్హతలు కలిగినటువంటి వారు దరఖాస్తులు చేసుకోవాలి.
ఎంపిక చేసే విధానం:
3,038 ఉద్యోగాలను రెగ్యులర్ విధానంలో డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి తెలంగాణ ఆర్టీసీ త్వరలో నోటిఫికేషన్ జారీ చేయబోతున్నది. ఈ ఉద్యోగాలకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, టీజీపీఎస్సీ, మెడికల్ బోర్డుల ద్వారా సెలక్షన్ ప్రాసెస్ చేస్తారు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తుకు కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు, ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికెట్స్
రెసిడెన్సి సర్టిఫికెట్ ఉండాలి
తెలంగాణ ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు వివిధ బోర్డుల ద్వారా త్వరలో అధికారిక నోటిఫికేషన్ జారీ చేసి రిక్రూట్మెంట్ చేస్తారు.
టీజిఎస్ ఆర్టిసి ఉద్యోగాల రిక్రూట్మెంట్ కి సంబంధించిన సమాచారం ఈ క్రింది లింక్స్ ద్వారా తెలుసుకోవచ్చు.
