తెలంగాణ యువతకు జపాన్ లో ఉద్యోగ అవకాశాలు: TOMCOM కొత్త ఒప్పంధాలు

తెలంగాణ ప్రభుత్వ ఉపాధి శిక్షణ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ యువతీ, యువకులకు జపాన్ దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా రెండు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలను అధికారికంగా కుదుర్చుకోవడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ ఓవర్సీస్ మాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, అలాగే జపాన్ కు చెందినటువంటి టెర్ను గ్రూప్, రాజ్ గ్రూప్ అనేటువంటి సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది.

ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తారు:

ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల ద్వారా, భవిష్యత్తులో రాబోయేటువంటి రెండు సంవత్సరాల కాలంలో దాదాపు 500 వరకు ఉద్యోగాలను తెలంగాణ యువతీ యువకులకు కల్పించే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. ఈ 500 ఉద్యోగాల్లో నిర్మాణరంగంలో 100 ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణ రంగంలో 200 ఉద్యోగాలు, ఇంజనీరింగ్ విభాగంలో 100 ఉద్యోగాలు, ఆతిథ్య రంగంలో మరో వంద ఉద్యోగాలను కల్పించమన్నారు. 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ ఒప్పందాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యువతకు నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు అంతర్జాతీయంగా ఉద్యోగ అవకాశాన్ని పొందే విధంగా లక్ష్యాలను ఏర్పరచుకొని దానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా శిక్షణ ఇవ్వబోతున్నారు.

ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ లో ఉన్నటువంటి తెలుగు యువతీ యువకులు తెలంగాణ రాష్ట్రంలో వచ్చి వారి యొక్క పెట్టుబడులు పెట్టాలని కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయంగా దేశాలతోనే పోటీ పడుతుందని, అభివృద్ధిలో అందరికంటే ముందుకు దూసుకుపోతుందని వెల్లడించడం జరిగింది.

తెలంగాణలో మూసి ప్రక్షాళన, రోడ్ల నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి రంగాలలో పురోగతి సాధించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రపంచంతో పోటీపడే విధంగా, అభివృద్ధిలో ముందుకు సాగే విధంగా తెలంగాణలోని అందరి సహకారం అవసరమని ఆయన కోరారు. ఈ సమావేశానికి జపాన్ తెలుగు సమాఖ్య ప్రతినిధులు, అలాగే టోక్యోలో స్థిరపడినటువంటి ప్రవాస తెలుగు వారు పాల్గొనడం జరిగింది.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 22న విడుదల

తెలంగాణకు దేశ విదేశాల నుంచి పెట్టబడును రావాలని ఉపాధి అవకాశాలు పెరగాలని ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలనేటువంటి ఉద్దేశంతో కామ అధికారంలోకి వచ్చినప్పటినుంచి కూడా ఎంతగానో కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దీనికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలని, అభివృద్ధికి సహకరించాలని కోరడం జరిగింది.

జపాన్ లో ఉద్యోగ అవకాశాలు పొందాలనుకునేటటువంటి యువతీ, యువకులు పైన తెలిపినటువంటి రిక్రూటింగ్ సంస్థలతో సంప్రదించాలని కోరడం జరిగింది.

TOMCOM అధికారిక వెబ్సైట్ :https://tomcom.telangana.gov.in/