AP TET Exam 2025:
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 పరీక్షలు డిసెంబర్ 10వ తేదీ నుండి రోజుకు రెండు షిఫ్టుల వారీగా నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షలకు 2,58,638 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారికంగా విద్యాశాఖ ప్రకటించింది. ఇందులో మహిళా అభ్యర్థులు 1,67,668 మంది ఉండగా , పురుష అభ్యర్థులు 90,970 మంది ఉన్నారు. మొత్తం దరఖాస్తులో 67% మంది మహిళలు ఉండడం గమనార్హం. అయితే ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, వారి యొక్క అడ్మిట్ కార్డ్స్ ని డౌన్లోడ్ చేసుకునేందుకు డిసెంబర్ 3, 2025వ తేదీ నుండి ఆన్లైన్లో లింక్ ఆక్టివేట్ చేయనున్నారు. అయితే ఈ ఆర్టికల్ ద్వారా మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో పూర్తి వివరాలు చూద్దాం.
ఏపీ టెట్ పరీక్ష ముఖ్యమైన తేదీలు?:
ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్ష యొక్క ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
| టెట్ అడ్మిట్ కార్డ్స్ విడుదల తేదీ | డిసెంబర్ 3, 2025 |
| టెట్ పరీక్షలు ప్రారంభమయ్యే తేదీ | డిసెంబర్ 10, 2025 |
| టెట్ ఫలితాలు విడుదల అయ్యే తేదీ | జనవరి 19, 2026 |
మొత్తం అప్లికేషన్స్?:
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ రాత పరీక్షకు లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. ఈసారి కూడా టెట్ పరీక్ష కోసం 2,58,638 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్ 1 పేపర్ 2 కు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయో ఈ క్రింది డేటా ద్వారా తెలుసుకోండి.
అటవీ శాఖలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ : ఇంటర్ అర్హత
- పేపర్ 1A మొత్తం అప్లికేషన్స్ : 1,01,882
- పేపర్ 2A మొత్తం అప్లికేషన్స్ :1,51,220
పైన తెలిపిన అప్లికేషన్స్ వివరాలు అధికారికంగా విద్యాశాఖ ద్వారా ప్రకటించబడినవి.
ఏపీ టెట్ అడ్మిట్ కార్డ్స్ విడుదల తేదీ?:
ఏపీ టెట్ 2025 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను డిసెంబర్ 3, 2025న విడుదల చేయనున్నారు. అభ్యర్థులు ఆ తేదీ నుండి అడ్మిట్ కార్డ్స్ ని డౌన్లోడ్ చేసుకొని షిఫ్టుల వారీగా పరీక్షలకు హాజరు కావాలి.
టెట్ అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
ఏపీ టెట్ అడ్మిట్ కార్డులను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అంగన్వాడిల్లో 14,236 ఉద్యోగాలు : 10th/ఇంటర్ అర్హత
- ముందుగా ఏపీ టెట్ అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్ళండి.
- అక్కడ” AP TET exam 2025 admit cards download ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- అభ్యర్థుల యొక్క యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయండి.
- వెంటనే మీ యొక్క అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అవుతుంది.
- ప్రింట్ అవుట్ తీసుకొని, అందులో ఉన్న పరీక్ష కేంద్రం అడ్రస్ చెక్ చేసుకోండి
FAQ’s:
1. ఏపీ టెట్ 2025 పరీక్ష ప్రారంభమయ్యే తేదీ ఏమిటి?.
డిసెంబర్ 10, 2025 నుండి షిఫ్టుల వారీగా ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
2. ఏపీ టెట్ పరీక్ష యొక్క అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు విడుదల చేస్తారు?.
డిసెంబర్ 3, 2025ను అడ్మిట్ కార్డులు విడుదలవుతాయి.
3. ఎన్ని లక్షల మంది ఏపీ టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు?.
2,58,638 మంది అభ్యర్థులు ఏపీ టెట్ 2025 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.
