AP Civil Supplies Dept. Notification 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ నుంచి ఖాళీగా ఉన్న 02 LPG మెకానిక్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు మూడు నుండి ఐదు సంవత్సరాల మధ్య అనుభవం కలిగి పదో తరగతి లేదా ఐటిఐ ఫిట్టర్ చేసినటువంటి అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష ఫీజు లేకుండా మెరిట్ మార్కులు మరియు అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క అర్హతలు, వయస్సు, సెలక్షన్ ప్రాసెస్ , అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
నోటిఫికేషన్ వివరాలు?:
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ |
| పోస్ట్ పేరు | LPG మెకానిక్ |
| అర్హతలు | 10th లేదా ITI ఫిట్టర్ |
| వయస్సు | 21 నుండి 40 సంవత్సరాలు |
| ఆఖరు తేదీ | 29th నవంబర్, 2025 |
| శాలరీ | ₹18,500/- |
Note: పైన తెలిపిన పూర్తి వివరాలు మీరు అధికారిక నోటిఫికేషన్లు కూడా చెక్ చేసుకోవచ్చు.
ఏపీ రెవెన్యూ శాఖలో 13 వేల ఉద్యోగాలు : Full details
పోస్టుల విద్యార్హతలు:
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ నుండి విడుదలైన ఎల్పిజి మెకానిక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పదోతరగతి లేదా ఐటిఐ లో ఫిట్టర్ అర్హత కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మూడు నుండి ఐదు సంవత్సరాలు ఎల్పిజి మెకానిక్ విభాగంలో అనుభవం కలిగినటువంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
ఎంత వయస్సు ఉండాలి?:
21 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయోపరిమితిలో మరొక ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
శాలరీ ఎంత?:
ఎల్పిజి మెకానిక్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹18,500 వరకు శాలరీ చెల్లిస్తారు. ఇది ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
వ్యవసాయ శాఖలో ఇంటర్ అర్హతతో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్టర్ జాబ్స్
సెలక్షన్ ప్రాసెస్?:
APSCSCL ఎల్పిజి మెకానిక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
- ముందుగా అప్లికేషన్స్ ని షార్ట్ లిస్టు చేస్తారు
- ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు.
- అర్హతలు కలిగిన వారి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్?:
ఏపీ పౌరసరఫరాల శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని నిర్నిత గడువులోగా దరఖాస్తులు సబ్మిట్ చేయాలి.
ఆఖరు తేది?:
ఏపీ పౌరసరఫరాల శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సబ్మిట్ చేయాలి.
- అప్లికేషన్ ప్రారంభ తేదీ : 22nd నవంబర్, 2025
- అప్లికేషన్ ఆఖరు తేదీ : 29th నవంబర్, 2025
Note: పైన తెలిపిన పూర్తి వివరాలు చూసిన తర్వాత అర్హతలు కలిగిన వారు వెంటనే అప్లై చేయండి.
