ఏపీ రెవెన్యూ శాఖలో 13,000 ఉద్యోగాలు | AP Revenue Dept. 13,000 Vacancy 2025 Full Details

AP Revenue Dept. Vacancy 2025:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీల లో భాగంగా ప్రతి సంవత్సరం నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ ని విడుదల చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2026 జనవరి నెలలో 99 వేల ఉద్యోగంలో జాబ్ క్యాలెండర్ కింద వివిధ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను విడుదల చేయాలని భావిస్తోంది. అయితే ఇందులో రెవెన్యూ శాఖలోని 13 వేల ఖాళీలు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే ఈ పోస్టులకి సంబంధించి త్వరలో పోస్టులవారీగా ఖాళీల వివరాలు వాటికి సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, వయసు యొక్క పూర్తి వివరాలు ప్రభుత్వం వెల్లడించనుంది. అయితే ప్రభుత్వ అధికారులు ప్రస్తుతానికి అన్ని డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

శాఖల వారీగా ఖాళీల వివరాలు:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ కేలండర్ లో భాగంగా 99 వేల ఉద్యోగాలను విడుదల చేయడానికి కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అధికారులు ప్రభుత్వానికి సూచనప్రాయంగా పంపిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Join Whats App Group

శాఖ పేరు మొత్తం ఖాళీలు
రెవెన్యూ శాఖ13,000
ఉన్నత విద్యాశాఖ7,000
పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ23,000
నైపుణ్యాభివృద్ధి శాఖ2,600
వ్యవసాయ శాఖ2,400
పంచాయతీరాజ్ శాఖ26,000
మహిళ, స్త్రీ , శిశు సంక్షేమ శాఖ1,820

Note: పైన తెలిపిన ఖాళీలన్నీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబడలేదు. అయితే, ఆ ఖాళీల వివరాలను అధికారులు ప్రభుత్వానికి చేరవేశారు.

రెవెన్యూ శాఖ 13,000 ఖాళీల వివరాల PDF

వ్యవసాయ శాఖలో ఇంటర్ అర్హతతో డైరెక్ట్ ఉద్యోగాలు

నోటిఫికేషన్ ఎప్పుడు?:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల యొక్క నోటిఫికేషన్లను 2026 వ సంవత్సరం జనవరి నెలలో, జాబ్ క్యాలెండర్ లో భాగంగా ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఉండవలసిన అర్హతలు?:

జాబ్ క్యాలెండర్ లో భాగంగా విడుదల కాబోయే ఈ ఉద్యోగాలకు ఈ క్రింది అర్హతలు తప్పనిసరిగా అభ్యర్థులు కలిగి ఉండాలి.

  • పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగి ఉండాలి.

ఎంత వయసు ఉండాలి?:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నుండి విడుదల అయ్యే ఉద్యోగాలకు ప్రతి అభ్యర్థికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నట్లయితే ఏ ఉద్యోగానికి అయినా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో మరొక ఐదు సంవత్సరాలు సదలింపు ఇస్తారు.

పోస్టల్ శాఖలో 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

కొన్ని శాఖల్లో పూర్తికాని వివరాల నమోదు?:

ఏపీ ప్రభుత్వం జాబ్ కేలండర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఖాళీల వివరాలు సేకరిస్తున్నారు. అయితే, కొన్ని శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల వివరాలు నమోదు కానందున, అధికారులు ఆ వివరాలను సేకరించి ప్రభుత్వానికి చేరవేసే పనిలో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం.

జాబ్ క్యాలెండర్ కి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా వెబ్సైట్ని సందర్శిస్తూ ఉండండి.