అంగన్వాడిల్లో 14,236 పోస్టులు – 10th/ఇంటర్ అర్హత | Anganwadi Jobs 2025 – Full Details

Anganwadi Jobs 2025:

తెలంగాణలోని అంగన్వాడిలో ఖాళీగా ఉన్న 14,236 టీచర్ మరియు హెల్పర్ ఉద్యోగాలను బట్టి చేయడానికి గతంలో రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీటి నియామకాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసి రిక్రూట్మెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనుమతి కూడా ఇచ్చింది. అయితే రిజర్వేషన్ల చిక్కుముడి వీడకపోవడంతో ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకి కదలడం లేదు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ అర్హత కలిగిన మహిళలు స్థానికంగా నివాసం ఉంటున్నటువంటి వారు మాత్రమే అర్హులుగా పరిగణించారు. అయితే నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎటువంటి రాస పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకొని ఇంటర్వ్యూలు నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. రిజర్వేషన్ల అమలు ఆలస్యం కారణంగా ఈ నోటిఫికేషన్ ప్రక్రియ ముందుకు సాగడం లేదని అధికారులు తెలుపుతున్నారు.

నోటిఫికేషన్ విడుదల ఆలస్యానికి గల కారణాలు?:

Join Whats App Group

14,236 టీచర్ మరియు హెల్పర్ ఉద్యోగాలను అంగన్వాడీల్లో భర్తీ చేయడానికి గతంలో ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినప్పటికీ, రాష్ట్రంలో రిజర్వేషన్ల ఖరారు కాకపోవడం ఎందుకు ఆటంకంగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో నిర్దేశించిన ఖాళీలకు రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత, సంబంధిత జిల్లా కలెక్టర్లు ప్రకటనలు విడుదల చేసి ఈ రిక్రూట్మెంట్ పూర్తి చేస్తారు.

అంగన్వాడీ జాబ్స్ లేటెస్ట్ అప్డేట్ : PDF

ఉండవలసిన అర్హతలు?:

అంగన్వాడి హెల్పర్ మరియు టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. ప్రభుత్వం పదవ తరగతి అర్హతను తీసివేసి ఇంటర్మీడియట్ అర్హతను పరిగణించే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది.

సెలక్షన్ ప్రాసెస్?:

అంగన్వాడీ హెల్పర్ మరియు టీచర్ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ ఈ క్రింది విధంగా ఉంటుంది.

Ap పౌర సరఫరాల శాఖలో 10త అర్హతతో డైరెక్ట్ జాబ్స్: Apply

  1. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి.
  2. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దరఖాస్తులు షార్ట్ లిస్టు చేస్తారు.
  3. స్థానిక మహిళలకే ప్రాధాన్యత ఉంటుంది.
  4. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
  5. ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
  6. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
  7. అన్ని అర్హతలు ఉన్న వారికి పోస్టింగ్ ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు ఉంటుందా?:

అంగన్వాడి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు ఉండదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

రెవెన్యూ శాఖలో 13,000 ఉద్యోగాలు ఖాళీ : Full Details

శాలరీ ఎంత?:

ఉద్యోగాలకు ఎంపిక అయినవారికి నెలకు ₹15,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమి ఉండవు. సొంత గ్రామంలో పోస్టింగ్ ఉంటుంది.

కావాల్సిన సర్టిఫికెట్స్:

అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.

  • 10వ తరగతి సర్టిఫికెట్
  • స్థానికత తెలిపే రెసిడెన్సీ సర్టిఫికెట్
  • కుల ధ్రువీకరణ పత్రాలు
  • ఆధార్ కార్డు
  • అప్లికేషన్ ఫారం
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్.

Note: అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. అధికారిక ప్రకటన రిజర్వేషన్స్ ఖరారు తర్వాత వచ్చే అవకాశం ఉంది. పూర్తి సమాచారం కోసం మా వెబ్సైటు చూడండి