NABFINS (NABARD) Notification 2025:
వ్యవసాయ శాఖ నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన (NABFINS) డిపార్ట్మెంట్ నుండి 10+2 అర్హతతో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి భారత దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా మెరిట్ మార్కులు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క అర్హతలు, వయస్సు, జీతం, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చదివి తెలుసుకోండి.
పోస్టుల ముఖ్యమైన వివరాలు?:
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | NABARD యొక్క NABFINS డిపార్ట్మెంట్ |
| పోస్ట్ పేరు | కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ |
| అర్హతలు | ఇంటర్ లేదా 10+2 అర్హత |
| వయస్సు | 18 నుండి 33 సంవత్సరాలు |
| ఆఖరు తేది | 28th నవంబర్, 2025 |
| వెబ్సైట్ లింక్ | Click Here |
పోస్టుల అర్హతలు?:
నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ నుండి విడుదలైన కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంటర్మీడియట్ లేదా 10+2 అర్హత కచ్చితంగా ఉండాలి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. రాష్ట్రాల వారిగా పోస్ట్లను విడుదల చేశారు.
గ్రామీణ పోస్టల్ శాఖలో 10వ తరగతి అర్హతతో డైరెక్ట్ జాబ్స్: No Exam
ఎంత వయసు ఉండాలి?:
18 నుండి 33 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఇది ప్రైవేటు విధానంలో భర్తీ చేస్తున్నందున ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో రిజర్వేషన్ కలిగిన వారికి వయోపరిమితిలో సడలింపు ఉండదు.
ఎంత శాలరీ ఉంటుంది?:
కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు ₹25,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర ఎలెవెన్సెస్ లేదా బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : Apply
ఎంపిక విధానం?:
నాబార్డ్ యొక్క ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ నుండి విడుదలైన ఉద్యోగాల యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఈ క్రింది విధంగా ఉంటుంది.
- ముందుగా అర్హతలను ఆధారంగా చేసుకొని అభ్యర్థులను షార్ట్ లిస్టు చేస్తారు.
- ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- ఎటువంటి రాత పరీక్ష ఉండదు
- అర్హులైన వారికి సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్:
కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ నాబార్డ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ ని ఓపెన్ చేయండి.
- అక్కడ మీరు ఎంచుకున్న రాష్ట్రం యొక్క అప్లికేషన్ ని క్లిక్ చేయండి
- అప్లికేషన్ పూర్తి చేసి తప్పులు లేకుండా సబ్మిట్ చేయండి.
- ఫీజు లేదు. ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఆఖరి తేదీ?:
ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నవంబర్ 28, 2025వ తేదీలోగా అప్లికేషన్స్ ని సబ్మిట్ చేయవలెను. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.
ముఖ్యమైన లింక్స్:
నాబార్డ్ కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు ఈ క్రింది లింక్స్ ద్వారా అప్లికేషన్స్ సబ్మిట్ చేయండి.
Note: పైన తెలిపిన పూర్తి వివరాలు చూసిన అభ్యర్థులు మీకు అర్హతలు ఉన్నట్లయితే గడువులోగా ఆన్లైన్లో అప్లికేషన్స్ సబ్మిట్ చేయండి.
