AP 10th Class Public Exam Time Table 2026:
ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి (SSC) 2026 పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేశారు. ఈసారి పదవ తరగతి పరీక్షలను మార్చి 16, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 01, 2026వ తేదీ వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు ముందుగానే పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రభుత్వం పూర్తి తేదీలతో కూడిన అధికారిగా టైం టేబుల్ ని ప్రకటించడం జరిగింది. ఈ ఆర్టికల్ ద్వారా ఏ రోజు ఏ పరీక్షను నిర్వహించనున్నారో పూర్తి సమాచారం తెలుసుకుందాం.
AP SSC 2026 Time Table:
- పరీక్షలు నిర్వహించే కాలం: 2026 మార్చి 16 నుండి 2026 ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.
సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలు ఇవే :
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి 2026 పరీక్షలకు సంబంధించి సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంది.
గ్రామీణ వ్యవసాయ శాఖలో ఇంటర్ అర్హతతో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు
- మార్చి 16, 2026 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 01
- మార్చి 18, 2026 : సెకండ్ లాంగ్వేజ్
- మార్చ్ 20, 2026 : ఇంగ్లీష్ లాంగ్వేజ్
- మార్చ్ 23, 2026 : మ్యాథమెటిక్స్
- మార్చ్ 25, 2026 : ఫిజిక్స్
- మార్చి 28, 2026 : బయాలజీ
- మార్చి 30, 2026 : సోషల్ సబ్జెక్ట్
- మార్చి 31, 2026 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 02
- ఏప్రిల్ 01, 2026 : SSC ఒకేషనల్ కోర్స్ ఎగ్జామినేషన్
Note: పైన తెలిపిన షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది.
AP SSC 2026 Exams Schedule Download
పోస్టల్ శాఖలో 10వ తరగతి అర్హతతో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్
పరీక్షల సమయం:
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్ష షెడ్యూల్లో భాగంగా ఏ రోజు ఏ సమయాల్లో పరీక్షలు నిర్వహిస్తారో టైం టేబుల్ లో ప్రకటించారు.
షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఈ క్రింది సమయంలో జరుగుతాయి.
- ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
- మొత్తం ఒక పరీక్ష రాయడానికి విద్యార్థికి మూడు 03 గంటల 15 నిమిషాల సమయం ఉంటుంది.
విద్యార్థులకు ముఖ్య సూచనలు?:
- పరీక్షల షెడ్యూల్ అధికారికంగా విడుదలైనందున విద్యార్థులు వారి యొక్క ప్రిపరేషన్ షెడ్యూల్ ని ప్రిపేర్ చేసుకోవాలి.
- ప్రతి సబ్జెక్టుకు కనీసం మూడు నుంచి నాలుగు రౌండ్లు రివిజన్ చేయడం మంచిది.
- ముఖ్యమైన మోడల్ పేపర్లు, గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలు ప్రాక్టీస్ చేయాలి.
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ వివరాలు మార్చి మొదటి వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఏపీ పదవ తరగతి 2026 పరీక్షల షెడ్యూల్ అధికారికంగా ప్రకటించింది. మార్చి 16వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకోవాలి అంటే ముందుగానే ఒక స్ట్రాటజీ తో చదవడం అవసరం. ఈ ఆర్టికల్ లో పేర్కొన్న సంపూర్ణ తేదీలు, టైమింగ్స్ విద్యార్థులకు చాలా ఉపయోగపడతాయి.
కావున పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.
