TG Endowment Dept. notification 2025:
తెలంగాణ దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న 324 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులన్నీ దేవాలయాల నిర్వహణ, పరిపాలన, భద్రత, పూజారి వ్యవస్థకు సంబంధించిన శాఖలకు సంబంధించిన పోస్టులు. త్వరలో అధికారికంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ విడుదల చేయాలని సంబంధిత దేవాలయాలకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ (EO) లకు ప్రభుత్వం ఆదేశాలు పంపింది. ఈ పోస్టులకి సంబంధించి దేవాదాయ శాఖ నుండి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్నాయి. ఈ పోస్టులకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం కొనసాగుతున్న 324 పోస్టుల భర్తీ ప్రక్రియ:
దేవదాయ శాఖలో ఉన్న ఖాళీలను జిల్లాల వారీగా, దేవాలయాల వారీగా పరిశీలించి అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. ఈ నివేదికలను ప్రభుత్వం సేకరించి నియామకాల నోటిఫికేషన్ల కోసం ప్రభుత్వం పరిశీలిస్తోంది. దేవాదాయ శాఖ యొక్క పనితీరు ఉత్తమంగా ఉండేందుకు ఈ నియామకాలు అత్యవసరమని అధికారులు భావిస్తున్నారు.
324 పోస్టుల భర్తీలో ఉండే ఉద్యోగాలు:
దేవదాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే బట్టి చేసే పోస్టులు ఈ క్రింది విధంగా ఉండవచ్చు ( అంచనాల ప్రకారం).

- ఆలయ సహాయకులు
- కార్యాలయం సిబ్బంది
- భద్రతా సిబ్బంది
- క్లరికల్ పోస్టులు
- పూజారి సహాయకులు లేదా సేవకులు
- టెక్నికల్ మరియు మెయింటెనెన్స్ సిబ్బంది
( ఖచ్చితమైన పోస్టుల వివరాలు అధికారిక నోటిఫికేషన్స్ విడుదలైన తరువాతే తెలుస్తాయి).
AP, TS స్కూల్ విద్యార్థులకు వరుసగా ఎనిమిది రోజులు సెలవులు: Details
పోస్టుల అర్హతల వివరాలు:
దేవదాయ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్స్ విడుదలైన తర్వాత దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు పదోతరగతి, ఇంటర్మీడియట్ , డిగ్రీ మరియు పీజీ అర్హత సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు?:
దేవాదాయ శాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.
- తదుపరి కొన్ని వారాల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.
- రిక్రూట్మెంట్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
ఎంత వయస్సు ఉండాలి?:
రైల్వేలో పరీక్ష లేకుండా పదవ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు: Apply
దరఖాస్తు చేసుకునే తెలంగాణ అభ్యర్థులకు ఈ క్రింది వయోపరిమితి కలిగి ఉండాలి.
- UR అభ్యర్థులకు: 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి
- SC, ST, OBC, EWS అభ్యర్థులకు : 18 నుండి 49 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
అధికారిక నోటిఫికేషన్ ఎక్కడ చెక్ చేసుకోవాలి?:
- TG ENDOWMENT DEPARTMENT అధికారిక వెబ్సైట్లో
- తెలంగాణ ప్రభుత్వ రిక్రూట్మెంట్ పోర్టల్ లో
- రోజువారి న్యూస్ పేపర్లు మరియు అధికారిక ప్రకటనల ద్వారా కూడా అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల వివరాలను తెలుసుకోవచ్చు.
Note: తెలంగాణ దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న 324 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇంకా అధికారిక నోటిఫికేషన్ విడుదల కాలేదు. మరి కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉన్నాయి కావున ప్రతిరోజు మా అధికారిక వెబ్సైట్ని సందర్శించండి.
