రైల్వేలో 10th, 10+2 అర్హతతో ఎటువంటి పరీక్ష లేకుండా గవర్నమెంట్ జాబ్స్ | RRC SWR Notification 2025 | Full Details

RRC Railway Notification 2025:

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి సౌత్ వెస్ట్రన్ రైల్వేలో ఖాళీగా ఉన్న 46 ఉద్యోగాలను స్పోర్ట్స్ కోట విభాగంలో భర్తీ చేయడానికి రైల్వే డిపార్ట్మెంట్ ఆఫీషియల్ గా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు 10th, 10+2, ఏదైనా డిగ్రీ అర్హత కలిగి స్పోర్ట్స్ విభాగంలో ఒలంపిక్స్ నేషనల్ గేమ్స్ స్టేట్ యూనివర్సిటీ గేమ్స్ లో పాల్గొని టాప్ త్రీ లో వచ్చిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్స్ నిర్వహించి, అందులో అర్హత పొందిన వారికి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

ముఖ్యమైన వివరాలు:

Join Whats App Group

అంశము వివరాలు
సంస్థ పేరురైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ వెస్ట్రన్ రైల్వే
మొత్తం ఖాళీలు46
పోస్టుల పేర్లులెవెల్ 2, 3, 4, 5 స్థాయి గ్రూప్ C ఉద్యోగాలు
అర్హతలు10th, 10+2, ఏదైనా డిగ్రీ రాతతో పాటు స్పోర్ట్స్ విభాగాల్లో అర్హతలు ఉండాలి
ఆఖరు తేదినవంబర్ 20, 2025
అధికారిక వెబ్సైట్Click Here

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

రైల్వే రిక్రూట్మెంట్ సెల్లు సౌత్ వెస్ట్రన్ రైల్వే హుబ్లీ నుంచి విడుదలైన స్పోర్ట్స్ కోటా విభాగంలోని 46 గ్రూప్ c స్థాయి ఉద్యోగాలను, స్పోర్ట్స్ విభాగాల్లో అర్హతలు కలిగి, 10th, 10+2, ఏదైనా డిగ్రీ అర్హతలు కలిగిన వారికి ఉద్యోగాలు ఇస్తారు.

ఏపీ సంక్షేమ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు : Apply

ఎంత వయసు ఉండాలి?:

రైల్వే స్పోర్ట్స్ కోట ఉద్యోగాలుగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనిష్టంగా 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 25 సంవత్సరాల వరకు వయస్సు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయో పరిమితులు మరికొన్ని సంవత్సరాలకు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు?:

రైల్వే స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది విధంగా ఆన్లైన్లో ఫీజులు చెల్లించాలి.

APSRTC లో పరీక్ష లేకుండా 291 పోస్టులు విడుదల : Apply

  • UR, OBC, EWS అభ్యర్థులకు: ₹500/- ఫీజు
  • SC, ST, PWD, ఉమెన్ అభ్యర్థులకు: ₹250/- ఫీజు

సెలక్షన్ ప్రాసెస్?:

రైల్వే రిక్రూట్మెంట్ స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

  1. ముందుగా ఆన్లైన్ అప్లికేషన్స్ ని షార్ట్ లిస్టు చేస్తారు.
  2. రాత పరీక్ష లేకుండా స్పోర్ట్స్ ట్రయల్ టెస్టులు నిర్వహిస్తారు.
  3. మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు.
  4. వెరిఫికేషన్ చేస్తారు.
  5. సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగాలు ఇస్తారు.

శాలరీ వివరాలు:

స్పోర్ట్స్ కోట విభాగంలో రైల్వే ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకి ₹30 వేల రూపాయల నుండి ₹50 వేల రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల వెలివెన్సెస్ ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు:

రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింద తెలిపిన తేదీలలోగా ఆన్లైన్లో అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి.

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 21st అక్టోబర్, 2025
  • దరఖాస్తులు ఆఖరి తేదీ :20th నవంబర్, 2025

ఎలా అప్లై చేయాలి?:

రైల్వే స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింద తెలిపిన లింక్స్ పై క్లిక్ చేసి గడువు లోగా ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకోండి.

Notification PDF

Apply Online

Note: పైన తెలిపిన వివరాలన్నీ చూసి అర్హతలు కలిగిన అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోగలరు.