APSRTC Notification 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) నుండి 291 పోస్టులతో అప్రెంటిస్ విధానలో రిక్రూట్మెంట్ చేసేందుకు గాను ఏడు జిల్లాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఐటిఐ అర్హత కలిగి ఉండవలెను. ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అభ్యర్థులకు అప్రెంటీషిప్ పోస్టింగ్ ఇస్తారు. కావున అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు చూసి గడువులోగా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోగలరు.
APSRTC జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:
| జిల్లా పేరు | పోస్టులు సంఖ్య |
| కృష్ణా | 38 |
| NTR | 87 |
| గుంటూరు | 41 |
| బాపట్ల | 22 |
| పల్నాడు | 44 |
| ఏలూరు | 30 |
| పశ్చిమ గోదావరి | 29 |
అర్హతలు:
ఏపీఎస్ఆర్టీసీ నుండి విడుదలైన 291 యొక్క పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు ఐటిఐ లోని సంబంధిత ట్రేడర్లో అర్హత కలిగి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. విద్యార్హతల్లో ఎక్కువ మార్కులు ఉన్నవారికి పోస్టింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
సింగరేణిలో ఉద్యోగాలు విడుదల : Apply
ఎంత stipend చెల్లిస్తారు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రింట్ షిప్ కాళీలకు ఎంపికైన వారికి నెలకు ₹8 వేల నుండి ₹10,000/- రూపాయల వరకు స్టీఫెన్ ఉంటుంది. ఇతర అలవెన్స్స్ ఏమీ ఉండవు.
ఎంత వయసు ఉండాలి?:
ఏపీఎస్ఆర్టీసీ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీసం 15 సంవత్సరాల నుంచి గరిష్టంగా 30 సంవత్సరాలు వరకు వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ , ఎస్టీ, ఓబీసీ మరియు పీడబ్ల్యుడి అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
TG TET నోటిఫికేషన్ విడుదల : Apply
ఎలా దరఖాస్తు చేయాలి?:
ఏపీఎస్ఆర్టీసీ అప్రెంటిషిప్ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ పెట్టుకునే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్.
- www.apprenticeshipindia.gov.in పోర్టల్ ను ఓపెన్ చేయండి.
- హోం పేజ్ లోని రైట్ సైడ్ కార్నర్ లో ఉన్న లాగిన్ లేదా రిజిస్టర్ అనేటటువంటి ఆప్షన్ చేసి కాండేట్ అనే ఆప్షన్ ఎంచుకోండి.
- రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అభ్యర్థుల యొక్క పూర్తి వివరాలు నమోదు చేయండి.
- మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది.
- మీకు వచ్చిన మెయిల్ ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి లింక్ పై క్లిక్ చేయండి
- లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయండి.
- అప్లికేషన్ ఫారం పూర్తి చేసి, కావలసిన సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేయండి.
- అప్లికేషన్లో పూర్తి వివరాలు కరెక్ట్ గా ఉన్నాయి లేదా చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి.
కావలసిన సర్టిఫికెట్స్:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫారం తో పాటు ఈ క్రింది సర్టిఫికెట్స్ కూడా సబ్మిట్ చేయాలి.
- అప్రెంటిషిప్ పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ ఫారం ప్రింట్ అవుట్.
- పదవ తరగతి మార్కులు లిస్ట్
- ఐటిఐ అర్హత సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రాలు
- రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
- పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్
- ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికెట్
- ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్
- ఇతర కావలసిన సర్టిఫికెట్లు ఉండవలెను.
Note : డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి హాజరయ్యే అభ్యర్థులు ₹118 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు నిమిత్తము చెల్లించవలెను.
అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు:
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 15th నవంబర్, 2025
- ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ : 30th నవంబర్, 2025
ముఖ్యమైన లింక్స్:
ఏపీఎస్ఆర్టీసీ అప్రెంటిస్ట్ ఖాళీల యొక్క ముఖ్యమైన నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లికేషన్ లింక్స్.
పైన తెలిపిన పూర్తి వివరాలు చూసి అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆఖరి తేదీలోగా దరఖాస్తులు చేసుకోగలరు.
