సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | SCCL Jobs Notification 2025 | Apply Online

SCCL Notification 2025:

తెలంగాణలోని సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) నుండి ఎగ్జిక్యూటివ్ కేడర్ కి సంబంధించిన 82 అసిస్టెంట్ ఇంజనీర్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను వెంటనే భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు సింగరేణిలో పనిచేస్తున్న ఎంప్లాయిస్ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి వారికి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు వయస్సు ఎంపిక విధానం, శాలరీ వివరాలకు సంబంధించిన పూర్తి సమాచారం చూడండి.

ముఖ్యమైన వివరాలు:

Join Whats App Group

అంశమువివరాలు
సంస్థ పేరు సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)
పోస్టుల సంఖ్య82
పోస్టుల పేర్లు అసిస్టెంట్ ఇంజనీర్ , జూనియర్ ఎగ్జిక్యూటివ్
అప్లికేషన్ ప్రారంభ తేదీ10th నవంబర్, 2025
అప్లికేషన్ ఆఖరి తేదీ24th నవంబర్, 2025
Apply Online LinkClick Here

ఎవరు అర్హులు?:

సింగరేణి నుండి విడుదలైన 82 ఉద్యోగాలకు ఆ సంస్థలో పనిచేస్తున్న ఇంటర్నల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. BE, BTECH, డిప్లొమా, BSC, MSC ఇలాంటి పలు విభాగాల్లో అర్హతలు కలిగినటువంటి ఎంప్లాయిస్ మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి. నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

TG TET నోటిఫికేషన్ 2026 విడుదల : Apply Link

ఎంత వయస్సు ఉండాలి?:

సింగరేణిలోని 82 ఎగ్జిక్యూటివ్ క్యారెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఇంటర్నల్ కాండేట్ అభ్యర్థులకు వయోపరిమితి తో సంబంధం లేదు. విద్యార్ధులు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పోస్టులకి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

సెలక్షన్ ప్రాసెస్?:

సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుండి విడుదలైన ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకి ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

KVS & NVS లలో 10,000+ పోస్టులు విడుదల : 10th, ఇంటర్ అర్హత

  1. ముందుగా అభ్యర్థులకు ఆఫ్లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు.
  2. రాత పరీక్షలో అర్హత పొందిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి
  3. అదే సంస్థలో అసిస్టెంట్ ఇంజనీర్గా లేదా జూనియర్ ఎగ్జిక్యూటివ్ గా పోస్టింగ్ ఇస్తారు

అప్లికేషన్ ఫీజు ఉందా?:

ఇంటర్నల్ కాండేట్స్ సింగరేణిలోని ఎగ్జిక్యూటివ్ క్యారెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. అభ్యర్థులందరూ ఉచితంగా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు.

పోస్టుల వారీగా శాలరీ వివరాలు:

సింగరేణిలోని ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకి ఎంపికైన అభ్యర్థులకు పోస్టులవారీగా ఈ క్రింది విధంగా జీతాలు చెల్లిస్తారు.

ఫుడ్ డిపార్ట్మెంట్ లో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Apply

  • అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు నెలకు : ₹50,000/-
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నెలకు: ₹40,000/- జీతాలు ఉంటాయి.

Note: ఇవి ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు అయినందున ఇతర అన్ని రకాల ఎలవెన్సెస్ కూడా సింగరేణి సంస్థ ఉద్యోగులకు చెల్లిస్తుంది.

ముఖ్యమైన లింక్స్:

సింగరేణి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చూసి మీకు అర్హతలు ఉన్నట్లయితే, గడువులోగా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోగలరు.

పైన తెలిపిన పూర్తి వివరాలను చూసిన తరువాత అర్హతలు కలిగిన అభ్యర్థులు గడువులోగా అప్లికేషన్స్ పెట్టుకోగలరు.