KVS & NVS Jobs Notification 2025:
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ (CBSE) వారు కేంద్రీయ విద్యాలయ మరియు నవోదయ విద్యాలయ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి ఈరోజు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 14,967 పైగా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను ఈ కంబైన్డ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్మీడియట్ , డిగ్రీ మరియు ఇతర అర్హతలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నవంబర్ 14, 2025 నుండి డిసెంబర్ 4, 2025వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం.
KVS & NVS ఉద్యోగాల వివరాలు:
| అంశము | వివరాలు |
| విడుదల చేసిన సంస్థ | కేంద్రీయ విద్యాలయ (KVS) మరియు నవోదయ విద్యాలయ(NVS) సంస్థలు |
| పోస్టుల పేరు | టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు |
| మొత్తం ఎన్ని పోస్టులు | 14,967 పోస్టులు |
| అప్లికేషన్ ప్రారంభ తేదీ | 14th November, 2025 |
| అప్లికేషన్ ఆఖరి తేదీ | 4th December, 2025 |
| ముఖ్యమైన వెబ్సైట్ లింక్స్ | www.cbse.gov.in www.kvsangathan.nic.in www.navodaya.gov.in |
పోస్టుల వివరాలు వాటి అర్హతలు?:
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ మరియు నవోదయ విద్యాలయ సంఘటన నుండి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్ట్లను భర్తీ చేయడానికి అధికారికంగా షార్ట్ నోటీస్ ని ఈరోజు CBSE బోర్డు అధికారులు విడుదల చేశారు. టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫుడ్ డిపార్ట్మెంట్లో ఎటువంటి పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Apply
ఎంత వయసు ఉండాలి?:
టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ అన్న SC, St, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాలు వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ :
కేంద్రీయ విద్యాలయ మరియు నవోదయ విద్యాలయ సంఘటన్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
తల్లికి వందనం పథకానికి మరొకసారి అప్లై చేసుకోవడానికి అవకాశం : Full Details
- ముందుగా ఆన్లైన్ అప్లికేషన్స్ స్వీకరిస్తారు
- అప్లై చేసుకున్న అభ్యర్థులకు మొదటగా కంప్యూటర్ ఆధారితరాత పరీక్ష నిర్వహిస్తారు.
- పోస్టులను అనుసరించి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు
- మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది
ఎంత ఫీజు చెల్లించాలి?:
కేంద్రీయ విద్యాలయ మరియు నవోదయ విద్యాలయ సంఘటన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి క్యాటగిరీల వారీగా అభ్యర్థులు ఈ క్రింది ఫీజులు చెల్లించవలెను.
- రిజర్వేషన్ లేని అభ్యర్థులు :Updated Soon
- SC, ST, OBC, PWD అభ్యర్థులు : Updated Soon
ఎంత శాలరీ ఉంటుంది?:
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹30 వేల రూపాయల నుండి ₹65 వేల రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలు అయినందున అన్ని రకాల అలవెన్సెస్ ఉద్యోగులకు చెల్లిస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి?:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నవంబర్ 14వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి.
- ముందుగా KVS & NVS అధికారిక వెబ్ సైట్ లోనికి వెళ్ళండి.
- రిజిస్ట్రేషన్ ఆప్షన్పై క్లిక్ చేసి మీ యొక్క పూర్తి వివరాలు నమోదు చేయండి.
- రిజిస్ట్రేషన్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి,
- మీ పూర్తి వివరాలతో అప్లికేషన్ ఫారం పూరించండి.
- అప్లోడ్ చేయాల్సిన అన్ని రకాల డాక్యుమెంట్స్ ని ఎటువంటి తప్పులు లేకుండా అప్లోడ్ చేయండి
- చెల్లించవలసిన ఆన్లైన్ ఫీజు చెల్లించి, అప్లికేషన్ సబ్మిట్ చేయండి
ముఖ్యమైన లింక్స్:
దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ మరియు వెబ్సైట్ ఆప్షన్స్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
Important Note: నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసిన తర్వాత, ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ యొక్క వివరాలు నమోదు చేసి, నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సబ్మిట్ చేయండి.
