Parivartan ECSS Scholarships 2025-26:
బడికి వెళ్లే విద్యార్థులకు వారి యొక్క చదువు ఆగిపోకుండా HDFC బ్యాంకు ప్రతి సంవత్సరం Parivartan ECSS (Educational Crisis Scholarship Support) Programme అనే స్కాలర్షిప్ పథకాన్ని విడుదల చేస్తుంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ స్కాలర్షిప్ అమలు చేయడానికి ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ లేదా డిప్లమా లేదా ఐటిఐ చదువుతున్నటువంటి విద్యార్థుల వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ మరొకసారి ప్రకటన విడుదల చేశారు. భారతదేశంలో ప్రస్తుతం సంబంధించినటువంటి తరగతుల్లో చదువు కొనసాగిస్తున్నటువంటి విద్యార్థిని, విద్యార్థులు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారికి ₹15 వేల నుండి ₹18 వేల రూపాయల వరకు స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది.
ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుని కొనసాగించలేని విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి మీకు అర్హత ఉన్నట్లయితే గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఎవరికోసం?:
ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ప్రధానంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల కోసం రూపొందించబడినటువంటి ప్రోగ్రాం :
ఏపీ ఆడబిడ్డ నిధి పథకం తాజా సమాచారం: Full Details
- ఫస్ట్ క్లాస్ నుండి 12వ తరగతి లేదా డిప్లమా వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు అర్హులు.
- ఇంటర్మీడియట్ లేదా డిప్లమా చదువుతున్న వారు అర్హులు.
- ITI, పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా అర్హులే.
అర్హతలు ( eligibility criteria):
ఈ స్కాలర్షిప్ పొందడానికి విద్యార్థులకు ఈ క్రింది అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.
- విద్యార్థులు తప్పనిసరిగా వారి యొక్క చదువు ప్రస్తుతం కొనసాగిస్తూ ఉండాలి.
- ప్రస్తుత విద్యా సంవత్సరం 2025-26 కి సంబందించి ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ లేదా డిప్లమా వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు అర్హులు.
- గత తరగతి పరీక్షల్లో కనీసం 55 శాతం మార్కులు వచ్చినవారై ఉండాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షలు దాటకూడదు.
- కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
ఎంత స్కాలర్షిప్ వస్తుంది? ( Total scholarship amount):
విద్యార్థులు చదువుతున్న తరగతులను బట్టి స్కాలర్షిప్స్ ఈ విధంగా చెల్లిస్తారు.
సికింద్రాబాద్ రైల్వే నుండి స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు : 10th అర్హత
| విద్యార్థుల తరగతి | స్కాలర్షిప్ మొత్తం |
| క్లాస్ 1-6 | ₹15,000/- |
| క్లాస్ 7-12 | ₹18,000/- |
| ఇంటర్మీడియట్ | ₹18,000/- |
| ITI /డిప్లొమా /పాలిటెక్నిక్ | ₹18,000/- |
పైన తెలిపిన మొత్తం స్కాలర్షిప్ డబ్బులను ఓకేసారీ విద్యార్థులు ఖాతాలో జమ చేస్తారు.
ఈ స్కాలర్షిప్ డబ్బులను ఏ ఖర్చులకు వాడుకోవచ్చు?:
ఏపీ, TS స్కూల్స్ విద్యార్థులకు ఈ నెలలో 6 రోజులు సెలవులు: Check Details
- స్కూల్ లేదా కాలేజీ ఫీజులకు
- పుస్తకాలు మరియు స్టేషనరీ వస్తువులను కొనుక్కోవడానికి
- ప్రయాణ ఖర్చులకు
- పరీక్ష ఫీజులకు
- ఇతర విద్యా అవసరాలకు వాడుకోవచ్చు.
దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ వివరాలు?:
పరివర్తన స్కాలర్షిప్స్ ప్రోగ్రాంకి దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ తప్పనిసరిగా ఉండాలి.
- విద్యార్థుల యొక్క ఆధార్ కార్డు
- రేషన్ కార్డ్ లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం
- గత విద్యా సంవత్సరం యొక్క మార్క్స్ మెమో ( 55% కంటే ఎక్కువ ఉండాలి )
- చదువుతున్న స్కూల్ లేదా కాలేజీ యొక్క బోనఫైడ్ సర్టిఫికెట్
- స్కూల్ ట్యూషన్ ఫీజు యొక్క రసీదు.
- బ్యాంకు ఖాతా వివరాలు.
- కుటుంబ ఆర్థిక పరిస్థితుల యొక్క వివరాలు అవసరం అవుతాయి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:
విద్యార్థులు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.
- ముందుగా విద్యార్థులు Buddy4study వెబ్సైట్ ఓపెన్ చేయండి
- “HDFC Bank Parivartan ECSS Scholarship” లింక్ పై క్లిక్ చేయండి
- “Apply Now” బటన్ పై క్లిక్ చేయండి
- మీ మొబైల్ లేదా ఈమెయిల్ అడ్రస్ తో రిజిస్టర్ చేసుకోండి.
- విద్యార్థుల యొక్క వివరాలన్నీ నమోదు చేసి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయండి.
- తప్పులు లేకుండా ఫారం పూర్తి చేసి సబ్మిట్ చేయండి.
దరఖాస్తు చేసుకునే ఆఖరు తేదీ :
ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాం కి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ : డిసెంబర్ 25, 2025.
ఆఖరి తేదీ కంటే ముందే అప్లై చేస్తే ఎంపిక అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున విద్యార్థినీ విద్యార్థులు త్వరపడండి.
ఎంపిక చేసే విధానం:
- ఆన్లైన్ అప్లికేషన్స్ స్క్రీనింగ్ చేస్తారు.
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
- అవసరమైతే విద్యార్థుల చేత టెలిఫోన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
- చివరగా అర్హులైనటువంటి విద్యార్థులకు, స్కాలర్షిప్ మొత్తాన్ని వారి యొక్క ఖాతాలో జమ చేస్తారు.
ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థినీ విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి అర్హులైనటువంటి అభ్యర్థులు డిసెంబర్ 31, 2025వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోగలరు.
Note: స్కాలర్షిప్స్ కి సంబంధించినటువంటి వివరాల కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు విజిట్ చేయండి.
