ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం తాజా సమాచారం – ప్రతి మహిళకు నెలకు ₹1,500/- : పూర్తి వివరాలు చూడండి.

AP Aadabidda Nidhi Scheme 2025:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడానికి ఎన్నికలలో ప్రకటించినటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో ఆసక్తి భారీగా పెరిగింది. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి మహిళకు 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసున్నటువంటి వారికి నెలకు 1500 రూపాయలు వారి యొక్క అకౌంట్లో డిపాజిట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకాన్ని గతంలోని అమలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయకపోవడంతో ఇంకా ఎప్పుడు అమలు చేస్తారా అనేటువంటి సందేహంలో లబ్ధిదారులు ఉన్నారు.

అయితే పథకానికి సంబంధించి తాజాగా వచ్చినటువంటి సమాచారాన్ని ఈ పూర్తి ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

ఆడబిడ్డ నిధి పథకం తాజా సమాచారం (నవంబర్ 2025 అప్డేట్):

Join Whats App Group

నవంబర్లో ఏపీ తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలకు సెలవుల తేదీలు

  1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని దశలవారీగా అమలు చేస్తామని ఇటీవల అధికారికంగా ప్రకటించి ఈ పథకంపై స్పష్టత ఇచ్చింది.
  2. ఈ పథకం అమలు కోసం లబ్ధిదారుల డేటా పరిశీలన & బ్యాంకు లింకేజీ ప్రక్రియ పూర్తి దశలో ఉందని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలియజేశాయి.
  3. మొదటి విడత నిదుల విడుదలకు సంబంధించినటువంటి అధికారిక షెడ్యూల్ ను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది.
  4. లబ్ధిదారుల అర్హత నిర్ధారణ –> బ్యాంకు లింకింగ్ –> నిధుల జమ అనే మూడు దశల ప్రక్రియను ప్రభుత్వం పరిశీలిస్తుంది.
  5. గమనిక: ఇప్పటివరకు “డబ్బులు జమ చేసాం” అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. ఇంకా డబ్బులు విడుదల ఫ్రీ ప్రాసెస్ దశలోనే ఉన్నది.

ఎవరెవరికి ₹1,500/- డిపాజిట్ చేస్తారు?:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ క్రింది మహిళలు ఈ పథకానికి అర్హులు :

సికింద్రాబాద్ రైల్వే లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు విడుదల : 10th అర్హత

  • ఆంధ్రప్రదేశ్ మహిళ అయి ఉండాలి.
  • మహిళ యొక్క వయస్సు కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 59 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • కుటుంబ ఆర్థిక పరిస్థితి వైట్ రేషన్ కార్డ్ కలిగిన వారే లేదా BPL హోదాలో ఉండాలి
  • లబ్ధిదారుని యొక్క బ్యాంకు ఖాతా ఆధార్ కార్డు తో లింక్ అయి ఉండాలి.
  • ఈ పథకానికి అర్హత పొందాలి అంటే ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కలిగిన వారు ఉండకూడదు.

అప్లికేషన్ చేసే విధానం (తాజా సమాచారం):

ఈ ఆడబిడ్డ నీది పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి.

  1. లబ్ధిదారులు నివాసం ఉంటున్న గ్రామంలోని గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు ఫారం తెచ్చుకుని అది పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
  2. లబ్ధిదారుడు నమోదు చేసినటువంటి డేటా ఏపీ ప్రభుత్వ పథకాల పోర్టల్లో వెరిఫికేషన్కు వెళుతుంది.
  3. లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వారి యొక్క అకౌంట్లో ప్రభుత్వం డబ్బులు డిపాజిట్ చేస్తుంది.

ఆడబిడ్డ నిధి పథకం అమలు తేది ఎప్పుడు?:

ప్రస్తుతం ప్రభుత్వ వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం :

టీటీడీ SVU లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు విడుదల: Apply

  • మొదటి విడత నిధుల విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు
  • ప్రభుత్వం అధికారిక తేదీ ఇంకా ప్రకటించలేదు.
  • అధికారిక తేదీ ప్రకటించిన వెంటనే లబ్ధిదారుల అధికారిక తేదీ ప్రకటించిన వెంటనే లబ్ధిదారుల జాబితాని తీసుకొని వారి యొక్క అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అర్హులైన లబ్ధిదారుల ఎకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తారు.

నోట్ : అంచనాల ప్రకారం ప్రభుత్వం ఈ పథకానికి బడ్జెట్ కేటాయించిన తర్వాత, మొదటి విడత నిధులను వారి యొక్క అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది.

మీ పేరు లిస్టులో ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి?:

  1. లబ్ధిదారులు మీ దగ్గరలోని సచివాలయానికి వెళ్లి అక్కడ ఎంక్వయిరీ చేయాలి.
  2. ఆడబిడ్డ నిధి పథకం బెనిఫిషరీ లిస్ట్ లోనికి వెళ్లి మీ పేరుని చెక్ చేసుకోవాలి.
  3. మీ ఆధార్ కార్డు నెంబర్ లేదా రేషన్ కార్డ్ నెంబర్ వెరిఫికేషన్ కోసం ఇవ్వాలి.
  4. అప్పుడు మీరు ఈ పథకానికి అర్హులా కాదా అనేటువంటి పూర్తి సమాచారం కంప్యూటర్ స్క్రీన్ పైన చూసుకోవచ్చు.

ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సంబంధించి ప్రస్తుతానికి ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. ఈ పథకానికి సంబంధించి P4 విధానంలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. త్వరలో ఈ పథకానికి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారాన్ని మా వెబ్సైట్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. కావున తాజా సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ ని సందర్శించండి.